‘అరణ్య’గా రానా – ఆకట్టుకుంటున్న టీజర్
రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న‘అరణ్య’ టీజర్ రిలీజ్..

రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న‘అరణ్య’ టీజర్ రిలీజ్..
రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘అరణ్య’.. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ, సామ్రాట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’, ‘రైలు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ దర్శకత్వంలో హిందీలో ‘హథీ మేరీ సాథీ’, తమిళ్‌లో ‘కాడన్’ పేర్లతో రూపొందుతుంది.
బుధవారం హిందీ, తమిళ్ టీజర్స్ రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. గురువారం సాయంత్రం ‘అరణ్య’ టీజర్ విడుదల చేశారు. అడవిని నమ్ముకుని, మూగా జీవాలతో సావాసం చేస్తూ బ్రతికే ఓ ఆదివాసి.. తనకి అన్నంపెట్టే అడవికి ఆపద వస్తే ఏం చేశాడు.. అనే పాయింట్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కినట్లు అర్థమవుతోంది. రానా డిఫరెంట్ గెటప్‌లో కనిపించాడు.
విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. ‘అయితే నువ్వెవరు’.. అని ఓ వ్యక్తి అడగ్గా.. ‘అరణ్య’ అని రానా బదులిస్తుండగా వెనకనుండి పులి రావడం ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత రసూల్ పూకుట్టి సౌండ్‌ఇంజినీర్‌గా పనిచేశారు. ఇటీవలే షూటింగ్‌పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌పనులు జరుపుకుంటోంది. ఏప్రిల్ 2న మూడు భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.