Karmastalam : అర్చన ‘కర్మ స్థలం’ మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన హీరో ఆకాష్ పూరి.. మహిషాసుర మర్దినిపై సినిమా..

తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ను హీరో ఆకాష్ పూరి రిలీజ్ చేశారు.

Arcfhana Karmastalam Movie Motion Poster Launch by Akash Puri

Karmastalam : రాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మాణంలో రాకీ షెర్మన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కర్మ స్థలం’. అర్చన, మితాలి చౌహాన్, వినోద్ అల్వా, కాలకేయ ప్రభాకర్, బలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్, చిత్రం శ్రీను.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ను హీరో ఆకాష్ పూరి రిలీజ్ చేశారు.

మీరు కూడా ఈ మోషన్ పోస్టర్ చూసేయండి..

ఈ మోషన్ పోస్టర్ లాంచింగ్ కార్యక్రమంలో ఆకాష్ పూరి మాట్లాడుతూ… ‘కర్మస్థలం’ టైటిల్ చాలా బాగుంది. మోషన్ పోస్టర్ కూడా బాగుంది. నేను కూడా అమ్మవారి భక్తుడిని.ఇలా అమ్మవారి గురించి సినిమా రావడం ఎగ్జైటింగ్ గా ఉంది. ఈ మధ్య హనుమాన్, కార్తికేయ, కాంతారా ఇలాంటి సినిమాలని ఆడియన్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ సినిమాని ని కూడా ముందుకు తీసుకెళ్తారు. నేను కర్మని నమ్ముతాను. మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చేడు జరుగుతుంది అని నమ్ముతాను. ఇలాంటి కథ చేయాలి అని నాకు కూడా ఉంది అని అన్నారు.

Also Read : Chiranjeevi Parents : చిరు, పవన్.. మాత్రమే కాదు వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంత సహాయం చేసారో తెలుసా..? చిరు ఏమన్నారంటే..

నటుడు విజయ్ శంకర్ మాట్లాడుతూ.. కర్మస్థలం అనే టైటిల్ లోనే ఒక రియాలిటీ వుంది. మైండ్ లోకి వెళ్లిపోయే టైటిల్. మొదటి నుంచి ప్రమోషన్స్ చాలా బాగా చేస్తున్నారు. మూవీ తీయడం ఎంత ఇంపార్టెంటో ఓ పది మందికి తెలిసేలా చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. టాలీవుడ్ లో చాలా సినిమాలు చేస్తున్నారు కానీ ప్రమోషన్స్ టైంలో డ్రాప్ అయిపోతున్నారు అని అన్నారు.

నటుడు క్రాంతి కిల్లి మాట్లాడుతూ.. మన సనాతన ధర్మం గురించి మన హిందూ ధర్మం గొప్పతనం చెప్పే సినిమాలు ఇటీవల వస్తున్నాయి. ఇది ఇంతటిత ఆగదు కర్మస్థలం తరువాత కూడా మన ధర్మంపై సినిమాలు వస్తాయి రావాలి. హిందుత్వం, సనాతన ధర్మం గొప్పతనాన్ని ఆందరూ ఆదరిస్తారు. ఆకాష్, నేను ఓ సారి కలిసినప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం. సడన్ గావ్ ఆగిపోయి కాళ్ళకి ఉన్న చెప్పులు తీసి దూరంలో రాయి రూపంలో ఉన్న ఓ దేవతకు దండం పెట్టాడు అని అన్నారు.

Also Read : Radhika : సీనియర్ నటి రాధిక కాలికి సర్జరీ.. ఉమెన్స్ డే రోజు ఎమోషనల్ పోస్ట్..

నిర్మాత యువరాజ్ మాట్లాడుతూ.. నేను పూణే నుంచి వచ్చాను. 8 నెలల క్రితం నేను రెండు లైన్స్ స్టోరీ విని నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను. సనాతన దర్మం గురించి చెప్పే సినిమా ఇది అని అన్నారు. డైరెక్టర్ రాకీ మాట్లాడుతూ.. మనం ఎలాంటి పండగ వచ్చినా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. దాని వెనకాల ఒక హిస్టరీ, వార్ చాలా వున్నాయి. ఇందులో మహిసాసుర మర్ధిని గురించి ఒక మంచి లైన్ చెప్పాను అని తెలిపారు.