‘అరెరే ఆకాశంలోనా’.. సాంగ్ అదిరిందిగా!..

  • Publish Date - September 21, 2020 / 06:24 PM IST
Arere Aakasham From Colour Photo: యువ నటుడు సుహాస్, చాందిని చౌదరి జంటగా సందీప్ రాజ్ దర్శకత్వంలో అమృత ప్రొడక్షన్స్, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై రూపొందుతున్న సినిమా.. ‘‘కలర్ ఫోటో’’.. సోమవారం ‘అరెరే ఆకాశంలోనా’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. కాల భైరవ ట్యూన్ కంపోజ్ చేయగా, కిట్టు విస్సాప్రగడ లిరిక్స్ రాశారు.. అనురాగ్ కులకర్ణి, కాల భైరవ కలిసి పాడారు. నలుపు రంగులో ఉండే హీరో తెల్లగా మారడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడనేది ఈ వీడియోలో చూపించారు.. సుహాస్ పలికించిన హావభావాలు సహజంగా ఆకట్టుకునేలా ఉన్నాయి.. ‘‘టూరింగు టాకీసు తెరనువ్వని.. నేనేమో కట్ అయిన టికెట్టుని.. మనజంట హిట్టయిన సినిమా అని.. అభిమానులే వచ్చి చూత్తారని’’ వంటి లిరిక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. త్వరలో తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’ ద్వారా ‘కలర్ ఫోటో’ ప్రేక్షకుల ముందుకు రానుంది.