Arjun Ambati : బిగ్ బాస్ అర్జున్ అంబటి హీరోగా సినిమా.. ఐటెం సాంగ్ రిలీజ్..

మీరు కూడా ఈ ఐటెం సాంగ్ ని వినేయండి..

Arjun Ambati Paramapadha Sopanam Movie Item Song Released

Arjun Ambati : సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ అంబటి బిగ్ బాస్ తో మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఇప్పుడు హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. SS మీడియా బ్యానర్ పై గిడిమిట్ల శివ ప్రసాద్ నిర్మాణంలో పూరి జగన్నాధ్ శిష్యుడు నాగశివ దర్శకత్వంలో అర్జున్ అంబటి, జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ జంటగా తెరకెక్కుతున్న సినిమా పరమపద సోపానం. ఈ సినిమా జూలై 11న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.

Also Read : Kamal Haasan : కమల్ హాసన్ కి షాక్ ఇచ్చిన ఫిలిం ఛాంబర్.. అయినా తగ్గేదెలా అంటున్న కమల్.. తలపట్టుకున్న థగ్‌ లైఫ్ నిర్మాతలు..

ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్ రిలీజ్ చేయగా తాజగా ఐటెం సాంగ్ రిలీజ్ చేసారు. ‘భూమ్ భూమ్..’ అంటూ సాగే ఈ ఐటెం సాంగ్ ని గీతా మాధురి పాడింది. డేవ్ జాండ్ సంగీత దర్శకత్వంలో రాంబాబు గోసాల ఈ పాటను రాసారు. మీరు కూడా ఈ ఐటెం సాంగ్ ని వినేయండి..