Arjun Ambati : సీరియల్ హీరో నుంచి సినిమా హీరోగా మారిన అర్జున్ అంబటి.. ‘పరమపద సోపానం’ టీజర్ విడుదల

ఇప్పటికే సీరియల్స్, పలు షోలతో మంచి ఫేమ్ తెచ్చుకొని, టీవీ ప్రేక్షకులకు కనెక్ట్ అయిన అర్జున్ అంబటి ఇప్పుడు సినిమా హీరోగా మెప్పించనున్నాడు. గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుతున్న పరమపద సోపానం యూనిట్ తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు.

Arjun Ambati : సీరియల్ హీరో నుంచి సినిమా హీరోగా మారిన అర్జున్ అంబటి.. ‘పరమపద సోపానం’ టీజర్ విడుదల

Arjun Ambati Paramapadha Sopanam Teaser released

Updated On : June 24, 2023 / 10:27 AM IST

Paramapadha Sopanam Teaser :  మాఫియా అక్రమాల నేపథ్యంలో SS మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న కొత్త సినిమా పరమపద సోపానం. గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అర్జున్ అంబటి హీరోగా నటిస్తుండగా ఆయన సరసన జెన్నిఫర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే సీరియల్స్, పలు షోలతో మంచి ఫేమ్ తెచ్చుకొని, టీవీ ప్రేక్షకులకు కనెక్ట్ అయిన అర్జున్ అంబటి ఇప్పుడు సినిమా హీరోగా మెప్పించనున్నాడు. గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుతున్న పరమపద సోపానం యూనిట్ తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు.

ఆయువు కోసం అరువులు చాస్తూ నోరు తెరిచిన కాల సర్పం కంట పడకుండా.. ఎగిరిపోవాలి అనే డైలాగ్ తో ప్రారంభమైన ఈ టీజర్ లో ఆసక్తికర ఎలిమెంట్స్ చూపించారు. సినిమా సోల్ తెలిసేలా యాక్షన్ సన్నివేశాలతో కట్ చేసి కథపై క్యూరియాసిటీ పెంచారు. టీజర్ లో వినిపించిన ఒకటి రెండు డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యాయి. పోలీస్ ఇన్వెస్టిగేషన్, మాఫియా ప్రధానంగా ఈ మూవీ రూపొందుతోందని స్పష్టం చేస్తూ వదిలిన ఈ టీజర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిందని చెప్పుకోవచ్చు.

ఈ చిత్రంలో అజయ్ రత్నం, పిల్లా ప్రసాద్, జ్యోతి, అనంత్, చింటూ, భాషా, సంతోష్, నమ్రిత తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. రాంబాబు గోశాల లిరిక్స్ రాశారు. గీతామాధురి, పృద్వి చంద్ర, హరిప్రియ, అదితి భావరాజు, యశస్వి కొండేపూడి సాంగ్స్ పాడారు. శివ శంకర్ మాస్టర్, యానీ మాస్టర్, సాయితేజ కొరియోగ్రఫీ అందించారు. దేవి శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేయగా సత్య మహావీర్ సంగీతం అందించారు.

Yash : నేను బాలీవుడ్ కి వెళ్ళను.. ఎవరైనా నా దగ్గరికే రావాలి.. రాకింగ్ స్టార్ యశ్ మాస్ రిప్లై..

ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం నాగ శివ చేస్తుండగా గుడిమిట్ల శివ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గౌతమ్ రాజ్ నెరుసు ఎడిటర్ గా, గణపర్తి నారాయణ రావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా, గుడిమిట్ల ఈశ్వర్ కో – ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్, ఇతర వివరాలు ప్రకటించనున్నారు మేకర్స్.