Arjun Das Shivathmika Rajashekar new movie in tamil with Vishal Venkat
Arjun Das – Shivathmika Rajashekar : యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ అర్జున్ దాస్.. ఒక పక్క స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే, మరోపక్క హీరోగా కూడా సినిమా ఛాన్సులు అందుకుంటున్నాడు. ఈక్రమంలోనే ఇటీవల తెలుగులో ‘బుట్టబొమ్మ’ సినిమాలో హీరోగా కనిపించి అలరించాడు. ఇప్పుడు కథానాయకుడిగా మరో సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాడు. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ యాక్ట్రెస్ శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్ గా నటించనుంది.
దొరసాని సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన శివాత్మిక.. తెలుగు, తమిళంలో సినిమాలు చేసుకుంటూ వస్తుంది. తాజాగా అర్జున్ దాస్‌కి హీరోయిన్‌గా తమిళంలో కొత్త సినిమాకి సైన్ చేసింది. ఇక ఈ చిత్రంలో శివాత్మిక బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించబోతుంది. ఇప్పటి వరకు ఈ భామ చేసిన ప్రతి సినిమాలో.. పక్కింటి అమ్మాయిలా కనిపించి అలరిస్తూ వచ్చింది. కానీ ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ తో అర్జున్ దాస్‌తో రొమాన్స్ చేయబోతుందట. పర్వతం దిగువ ప్రాంతంలో నివసించే వ్యక్తుల చుట్టూ ఈ సినిమా కథ సాగనుంది.
Vijay Deverakonda : తమిళ్ దర్శకుడితో సినిమా కన్‌ఫార్మ్ చేసిన విజయ్ దేవరకొండ..
అర్జున్ దాస్ గుర్రపుడెక్కలు చేసే వ్యక్తిగా ఈ సినిమాలో నటించబోతున్నాడు. ఆగష్టు 30 నుంచి ఈ సినిమా షూటింగ్ పట్టాలు ఎక్కనున్నట్లు మేకర్స్ తెలియజేశారు. రిలీజ్ చేసిన మూవీ పోస్టర్ ఆకట్టుకుంటుంది. డి ఇమ్మాన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా చేస్తున్నాడు. ఇప్పటికే రెండు పాటలను కంపోజ్ చేశాడని, సినిమాలో ఆరు పాటలు ఉంటాయని వెల్లడించారు. సుధా సుకుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాని తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తారా? లేదా? అనేది చూడాలి.