Shalini Pandey: స్లిమ్మైన అర్జున్ రెడ్డి భామ.. చక్కనమ్మ చిక్కినా అందమే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక వైబ్రేషన్ క్రియేట్ చేసిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమాతో హీరో విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మారి ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి చేరుకున్నాడు.

Shalini Pandey

Shalini Pandey: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక వైబ్రేషన్ క్రియేట్ చేసిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమాతో హీరో విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మారి ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి చేరుకున్నాడు. ఇక హీరోయిన్ షాలినీ పాండేకి కూడా మంచి ఐడెంటిఫికేషన్ దక్కింది. ఈ సినిమాలో కాస్త బొద్దుగా ఉంటూ.. పాత్రకు తగ్గట్టగా క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. సినిమా చూసి బయటకి వచ్చిన ప్రేక్షకులకు ఆమె మనసులో అలా ఉండిపోయేలా కనిపించింది. అయితే.. ఆ సినిమా తర్వాత అనుకున్న స్థాయిలో అవకాశాలను మాత్రం అందుకోలేకపోయింది.


ఇప్పుడు ఏమైందో కానీ ఒక్కసారి బక్కచిక్కిపోయింది. ఎంతగా అంటే తరచి తరచి చూసినా గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లుగా స్లిమ్ లుక్ లో కూడా షాలినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ‘జయేష్‌భాయ్‌ జోర్దాన్‌’లో నటిస్తున్న షాలినీ ఆ సినిమా కోసమే బరువు తగ్గిందట. ఆ సినిమాలో ఆమె డ్యాన్సర్‌ పాత్రలో కనిపిస్తోండగా బరువు తగ్గి, సన్నబడాల్సిందే అని ఆ చిత్ర నిర్మాత ఆదిత్య చోప్రా రూల్‌ పెట్టడంతో తప్పక ఇలా స్లిమ్ లోకి మారాల్సి వచ్చిందట.


ఇలా ఒక్కసారిగా బరువు తగ్గడం సామాన్యమైన విషయం కాదు. ఇందులో ఏ మాత్రం తేడా కొట్టినా అది కెరీర్ మీద దెబ్బపడుతుంది. అందుకే షాలినీ ప్రత్యేకంగా ఓ డైట్‌ ప్లాన్‌ చేసుకుందట. అలాగే రోజుకు నాలుగు గంటలు డ్యాన్స్‌ తో స్పెషల్ డైట్ ప్లాన్ తో ఇలా స్లిమ్ గా మారింది. ఇలా తగ్గడంతో పెద్ద ఇబ్బందులు ఏమీ ఎదురవలేదని చెప్పింది షాలిని. ఎలాగూ సన్నబడింది కనుక ఫోటో షూట్స్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంది.