Aishwarya : స్టార్ కమెడియన్ కొడుకుతో హీరో అర్జున్ కూతురి నిశ్చితార్థం..

యాక్షన్ హీరో అర్జున్ సర్జా తన కూతురు ‘ఐశ్వర్య' స్టార్ కమెడియన్ కి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాడు. నేడు వారిద్దరి ఎంగేజ్మెంట్..

Arjun Sarja Daughter Aishwarya Thambi Ramaiah son Umapathy engagement

Aishwarya : తెలుగు, తమిళంలో యాక్షన్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్న అర్జున్ సర్జా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం అడపాదడపా హీరోగా సినిమాలు చేస్తూనే.. ఇతర సినిమాల్లో ముఖ్య పాత్రలు చేస్తూ వస్తున్నాడు. ఈమద్యలో డైరెక్టర్ గా కూడా సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. ఈక్రమంలోనే తన కూతురు ‘ఐశ్వర్య సర్జా’ని హీరోయిన్ గా పెట్టి ఒక సినిమా తెరకెక్కించడానికి గత కొంతకాలంగా కష్టపడుతూ ఉన్నాడు. అయితే కూతురు ప్రేమ, పెళ్లి అంటూ మ్యారేజ్ లైఫ్ ని స్టార్ట్ చేసేస్తుంది.

ఐశ్వర్య కొన్నాళ్ల నుంచి తమిళ స్టార్ కమెడియన్ కొడుకుతో ప్రేమాయణం నడుపుతూ వస్తుంది. తమిళ పరిశ్రమలో తనదైన కామెడీతో ఆడియన్స్ ని అలరించే ‘తంబి రామయ్య’ కుమారుడు ‘ఉమాపతి’తో ఐశ్వర్య ప్రేమలో పడింది. వీరిద్దరి ప్రేమ వార్త ఎప్పటినుంచో తమిళ మీడియాలో వినిపిస్తూ వస్తుంది. నేడు ఎంగేజ్మెంట్ తో ఆ వార్తలు నిజమయ్యాయి. ఉమాపతి తమిళంలో హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటివరకు నాలుగు సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం ‘దేవదాస్’ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే ఒక టెలివిజన్ షో కూడా చేస్తున్నాడు.

Also read : Vijay Deverakonda : ఐరనే వంచాలా ఏంటి.. విజయ్ ప్రమోషన్స్ మాములుగా లేవుగా.. మార్కెట్‌లోకి టి-షర్ట్స్..

ప్రస్తుతం ఈ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నిశ్చితార్ధ వేడుకను ఇరు కుటుంబసభ్యుల మధ్య చాలా సింపుల్ గా చేసినట్లు తెలుస్తుంది. ఎంగేజ్మెంట్ రింగులు మార్చుకున్న ఈ జంట.. ఎప్పుడు ఏడడుగులు వేయనున్నారు అనేది తెలియాల్సి ఉంది.