Vijay Deverakonda : ఐరనే వంచాలా ఏంటి.. విజయ్ ప్రమోషన్స్ మాములుగా లేవుగా.. మార్కెట్లోకి టి-షర్ట్స్..
'ఐరనే వంచాలా ఏంటి' డైలాగ్ ట్రెండ్ ని విజయ్ దేవరకొండ అండ్ ఫ్యామిలీ స్టార్ మూవీ టీం.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఓ రేంజ్ లో ఉపయోగించేసుకుంటున్నారు.

Vijay Deverakonda use Airanevonchalaenti dialogue trend for Family Star promotions
Vijay Deverakonda : టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తన సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ని ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నాడు. గీతగోవిందం సినిమాతో విజయ్ కి సూపర్ హిట్టుని అందించిన పరుశురామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ ఒక గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. మాస్ అండ్ క్లాస్ కట్ తో ఉన్న ఆ గ్లింప్స్ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. ఇక ఆ గ్లింప్స్ లో విజయ్ చెప్పిన.. ‘ఐరనే వంచాలా ఏంటి’ డైలాగ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
#Airanevonchalaenti అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియా అంతా మీమ్ వీడియోలు, ఫన్నీ పోస్టులతో నిండిపోయింది. ఇక ఈ ట్రెండ్ ని విజయ్ దేవరకొండ అండ్ ఫ్యామిలీ స్టార్ మూవీ టీం.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఉపయోగించేసుకుంటున్నారు. ఆ డైలాగ్ తో నిర్మాతలు కొత్త పోస్టర్స్ ని రిలీజ్ చేస్తే, విజయ్ తన రౌడీ బ్రాండ్ నుంచి ఒక టి-షర్ట్ ని కూడా మార్కెట్ లోకి తీసుకు వచ్చేసాడు. ఐరనే వంచాలా ఏంటి అనే టైటిల్ ఆ టి-షర్ట్ పై ప్రింట్ వస్తుంది. ఫ్యాన్స్ దీనిని కొనుగోలు చేయడానికి ఒక లింక్ ని కూడా ఇచ్చాడు. ఒక షర్ట్ ధర రూ.790 చూపిస్తుంది.

Vijay Deverakonda use Airanevonchalaenti dialogue trend for Family Star promotions
Also read : Re-Release : రీ రిలీజ్స్లో కొత్త ట్రెండ్ మొదలు పెడుతున్న అల్లు అరవింద్.. ఏంటో తెలుసా..?
ఇక విజయ్ చేస్తున్న ప్రమోషన్స్ చూసి నెటిజెన్స్ పలు ఫన్నీ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీలో విజయ్ తండ్రిగా, భర్తగా ఒక కొత్త రోల్ లో కనిపించి ఆడియన్స్ ని థ్రిల్ చేయబోతున్నాడు. గ్లింప్స్ లోని విజయ్ లుక్స్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు.