Arjun Das: అర్జున్ దాస్ బ్రేకప్ పోస్ట్.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన స్టార్ యాక్టర్
సౌత్ స్టార్ యాక్టర్ అర్జున్ దాస్(Arjun Das) చేసిన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
- V Santhosh Kumar
- Published On : March 13, 2026 / 12:26 PM IST
arjundas emotional post on instagram
- అర్జున్ దాస్ ఎమోషనల్ పోస్ట్
- లవ్ బ్రేకప్ అంటున్న నెటిజన్స్
- లేదు లేదు మూవీ ప్రమోషన్స్ అంటున్న మరికొంతమంది
Arjun Das: సహజమైన నటన, విలక్షణమైన గొంతుతో సౌత్ ప్రేక్షకులను మెప్పించిన నటుడు అర్జున్ దాస్. ఆయనకన్నా ఆయన గొంతుకే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడు జావియల్ గా, సరదగా ఉండే అర్జున్ దాస్ లేటెస్ట్ పెట్టిన పోస్ట్ ఒకటి ఇప్పుడు సంచలనంగా మారింది. ఎప్పుడూ సినిమా అప్‌డేట్స్, ప్రొఫెషనల్ విషయాలను మాత్రమే షేర్ చేసే అర్జున్(Arjun Das), సడన్‌గా ఎమోషనల్ ‘హార్ట్ బ్రేకింగ్’ పోస్ట్ పెట్టడం నెటిజన్స్ ను షాక్‌కు గురిచేస్తోంది.
Couple Friendly OTT: ఓటీటీకి వచ్చేసిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘కపుల్ ఫ్రెండ్లీ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
తాజాగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆయన స్పందిస్తూ.. “మీరు ఎవరినైనా అమితంగా ప్రేమిస్తే, వారు మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతారు. అసలు ఒక మనిషి ఇంత సులభంగా ఎలా మూవ్ ఆన్ అవుతారు?” అంటూ రాసుకొచ్చారు. ఈ బ్రేకప్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో, అర్జున్ దాస్ నిజంగానే ప్రేమలో విఫలమయ్యారా? లేక ఆయన వ్యక్తిగత జీవితంలో ఏదైనా విషాదం చోటుచేసుకుందా? అనే చర్చ మొదలైంది.
నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తూ సానుభూతి వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం తదుపరి సినిమా, ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్ ప్రమోషన్స్‌లో భాగంగా చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ అయి ఉండొచ్చని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా, అర్జున్ దాస్ ఇలా ఎమోషనల్ పోస్ట్ పెట్టడం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
