Kangana
Kangana Ranaut Vs Javed Akhtar: బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం, సెప్టెంబర్ 14న, అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు గీత రచయిత జావేద్ అక్తర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణలో కంగనా రనౌత్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో కంగనా హాజరుకానప్పటికీ, విచారణ కోసం జావెద్ అక్తర్ భార్య, బాలీవుడ్ నటి షబానా అజామితో కోర్టుకు హాజరయ్యారు.
కంగనా రనౌత్ తరఫు న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖీ, ఈ కేసు విషయంలో మాట్లాడుతూ.. కంగనా ఆరోగ్యం బాగాలేదని, ఈ కారణంగా ఆమె కోర్టుకు హాజరుకాలేకపోతున్నట్లు చెప్పారు. కంగనా ఆరోగ్య కారణాల వల్ల కోర్టుకు హాజరుకాకుండా పదేపదే మినహాయింపు కోరుతున్నారు. అయితే, సెప్టెంబర్ 20న కంగనా కోర్టుకు హాజరు కాకపోతే, ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.
వ్యక్తిగతంగా హాజరు కాకుండా పదే పదే మినహాయింపు కోరుతుండడంపై అసహనం వ్యక్తంచేసిన కోర్టు.. తదుపరి విచారణకు సెప్టెంబర్ 20వ తేదీన వ్యక్తిగతంగా హాజరుకాకపోతే అరెస్ట్ వారెస్ట్ జారీ చేస్తానని హెచ్చరించింది. గతంలో, జావేద్ అక్తర్ ఆమెపై వేసిన పరువు నష్టం కేసులను రద్దు చేయాలని కోరుతూ కంగనా రనౌత్ వేసిన పిటిషన్‌లని బొంబాయి హైకోర్టు తోసిపుచ్చింది.
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామితో ఇంటర్వ్యూలో పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు మరియు నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు అఖ్తర్ 2020 నవంబర్‌లో అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌లో రనౌత్‌పై ఫిర్యాదు చేశారు. కోర్టు, డిసెంబర్ 2020లో, కంగనా రనౌత్‌పై అక్తర్ చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేయాలని, ఆపై ఆమెపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రారంభించాలని జుహు పోలీసులను ఆదేశించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కంగనాకి సమన్లు జారీ చేసింది కోర్టు.