Surekhavani : టాటూ వేయించుకున్న ‘సురేఖవాణి’.. ఏం టాటూ వేయించుకుందో చూశారా? వీడియో వైరల్..

తాజాగా సురేఖవాణి పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది.

Artist Surekhavani got a Tattoo Shares a Video goes Viral

Surekhavani : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సురేఖవాణి ఇటీవల సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ మరింత వైరల్ అవుతుంది. అయితే ఇటీవల సినిమాలు మాత్రం తగ్గించేసింది సురేఖవాణి. తాజాగా సురేఖవాణి పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది.

సురేఖవాణి తన కుడి చేతి మీద టాటూ వేయించుకుంది. టాటూ వేయించుకుంటుండగా ఆ నొప్పికి అరుస్తున్న వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన చేతిపై వేంకటేశ్వరస్వామి నామాలు, వేంకటేశ్వరస్వామి పాదాలను టాటూగా వేయించుకుంది సురేఖవాణి.

Also Read : Dil Raju : తెలంగాణ గద్దర్ అవార్డ్స్.. దిల్ రాజు కీలక ప్రకటన.. వాళ్లందరికీ కూడా అవార్డులు..

ఈ వీడియో షేర్ చేసి.. అతను మొదట నడిచాడు. నేను అతని స్టెప్స్ ని ఫాలో అవుతున్నాను. నా పెదబాబు.. గోవిందా గోవిందా అంటూ వెంకటేశ్వరస్వామిపై తనకున్న భక్తిని పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. మీరు కూడా సురేఖవాణి టాటూ వేయించుకుంటున్న వీడియో చూసేయండి..

 

ఇక సురేఖవాణి కూతురు సుప్రీత సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో వైరల్ అవ్వగా త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే మూడు సినిమాలకు ఓకే చేసింది సుప్రీత.

Also Read : HariHara VeeraMallu : బాహుబలికి ఎక్కువ.. ఆదిపురుష్ కి తక్కువ.. ‘హరిహర వీరమల్లు’ సరికొత్త రికార్డ్..