Dil Raju : తెలంగాణ గద్దర్ అవార్డ్స్.. దిల్ రాజు కీలక ప్రకటన.. వాళ్లందరికీ కూడా అవార్డులు..

నేడు తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించి గద్దర్ అవార్డులపై కీలక వ్యాఖ్యలు చేసారు.

Dil Raju : తెలంగాణ గద్దర్ అవార్డ్స్.. దిల్ రాజు కీలక ప్రకటన.. వాళ్లందరికీ కూడా అవార్డులు..

Dil Raju Interesting Comments on Telangana Gaddar Film Awards

Updated On : June 12, 2025 / 9:49 PM IST

Dil Raju : గత కొన్ని ఏళ్లుగా ఆగిపోయిన నంది అవార్డులను తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ పేరిట ఇస్తామని ప్రకటించారు. ఇటీవలే 2024 సంవత్సరానికి గాను గద్దర్ అవార్డులను ప్రకటించారు. అలాగే గత పదేళ్లలో ప్రతి సంవత్సరం మూడేసి బెస్ట్ సినిమాలకు కూడా అవార్డులు ప్రకటించారు. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ప్రధాన ఉత్సవం ఈనెల 14న హైటెక్స్ లో నిర్వహిస్తున్నారు.

దీనికి సంబంధించి నేడు తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేసారు.

Also Read : HariHara VeeraMallu : బాహుబలికి ఎక్కువ.. ఆదిపురుష్ కి తక్కువ.. ‘హరిహర వీరమల్లు’ సరికొత్త రికార్డ్..

ఈ ప్రెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. 14 ఏళ్ళ తర్వాత జరగబోతున్న అవార్డుల వేడుకను ప్రభుత్వంతో పాటు సినీ పరిశ్రమ కూడా అందరూ విజయవంతం చేయాలి. 2024 సినిమాలకు గద్దర్ అవార్డులు ప్రకటించాము. అలాగే 2014 నుంచి 2023 వరకు ఏడాదికి మూడు చొప్పున బెస్ట్ సినిమాలు కూడా ప్రకటించాము. ఈ నేపథ్యంలో పదేళ్లలో అనౌన్స్ చేసిన బెస్ట్ సినిమాలకు నాలుగు అవార్డులు ఇవ్వబోతున్నాము. ప్రతి సినిమా నుంచి హీరో, హీరోయిన్, డైరెక్టర్, నిర్మాతలకు అవార్డులు అందివ్వనున్నాము. ఇలా ఉత్తమ చిత్రాలకు నలుగురికి అవార్డులు ఇవ్వడం ఇదే మొదటిసారి అని తెలిపారు.

Also Read : Tiger Shroff : ఇదేంట్రా బాబు.. అండ‌ర్‌వేర్ లో క్రికెట్ ఆడిన స్టార్ హీరో.. వీడియో వైరల్..