HariHara VeeraMallu : బాహుబలికి ఎక్కువ.. ఆదిపురుష్ కి తక్కువ.. ‘హరిహర వీరమల్లు’ సరికొత్త రికార్డ్..

VFX విషయంలో హరిహర వీరమల్లు సరికొత్త రికార్డ్ సెట్ చేసింది.

HariHara VeeraMallu : బాహుబలికి ఎక్కువ.. ఆదిపురుష్ కి తక్కువ.. ‘హరిహర వీరమల్లు’ సరికొత్త రికార్డ్..

Pawan Kalyan HariHara VeeraMallu Creates New Record in VFX Work Comparing with Adipurush and Baahubali

Updated On : June 12, 2025 / 8:58 PM IST

HariHara VeeraMallu : గత అయిదేళ్లుగా సాగి ఎట్టకేలకు షూట్ పూర్తి చేసుకుంది పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసి ప్రమోషన్స్ కూడా చేసారు. కానీ చివరి నిమిషంలో VFX వర్క్ అవ్వలేదని సినిమా రిలీజ్ వాయిదా వేశారు. తాజాగా హరిహర వీరమల్లు VFX వర్క్ కూడా పూర్తయిందని ట్వీట్ చేసారు మూవీ యూనిట్.

అయితే ఈ VFX విషయంలో హరిహర వీరమల్లు సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. హరిహర వీరమల్లు సినిమాకు మొత్తం 6000కు పైగా VFX షాట్స్ వాడారని సమాచారం. డైరెక్టర్ జ్యోతి కృష్ణ కూడా ఈ సినిమాకు VFX వర్క్ ఎక్కువే ఉందని తెలిపారు. హరిహర వీరమల్లు సినిమాకు ఏకంగా 6000 VFX షాట్స్ వాడారని తెలియడంతో ఆశ్చర్యపోతున్నారు.

Also Read : Sukumar – Thabitha : సుకుమార్ 16వ వెడ్డింగ్ యానివర్సరీ.. స్పెషల్ ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేసిన తబిత..

ఇప్పటివరకు ఇండియన్ సినిమాల్లో అత్యధికంగా ప్రభాస్ ఆదిపురుష్ సినిమాకు 8000 VFX షాట్స్ వాడారు. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాకు 6000కు పైగా VFX షాట్స్ వాడారు. బాలీవుడ్ బ్రహ్మాస్త్ర సినిమాకు 4500 లకు పైగా VFX షాట్స్ వాడారు. బాహుబలి 1 సినిమాకు 4000 కు పైగా VFX షాట్స్ వాడారు. రోబో 2.0 సినిమాకు 3400 కు పైగా VFX షాట్స్ వాడారు.

అలా VFX విషయంలో హరిహర వీరమల్లు సినిమా బాహుబలిని మించిపోతే ఆదిపురుష్ మొదటి ప్లేస్ లో తర్వాత సెకండ్ ప్లేస్ లో హరిహర వీరమల్లు సినిమా నిలిచింది.

Also See : Anchor Sravanthi : గోవాలో సముద్రపు ఒడ్డున.. చీరలో యాంకర్ స్రవంతి.. ఫొటోలు..