Tiger Shroff : ఇదేంట్రా బాబు.. అండర్‌వేర్ లో క్రికెట్ ఆడిన స్టార్ హీరో.. వీడియో వైరల్..
. తాజాగా బాలీవుడ్ హీరో షూటింగ్ లో క్రికెట్ ఆడి పోస్ట్ చేసిన వీడియో మాత్రం వైరల్ గా మారింది. ఎందుకంటే హీరో అండర్‌వేర్ లో క్రికెట్ ఆడటం గమనార్హం.

Bollywood Hero Tiger Shroff Played Cricket in Underwear Video goes Viral
Tiger Shroff : సినిమా సెలబ్రిటీలు షూటింగ్స్ లో అప్పుడప్పుడు ఖాళీగా ఉంటే అక్కడ ఉండే వాళ్ళతో ఏవైనా గేమ్స్ ఆడతారని తెలిసిందే. గతంలో అనేకసార్లు పలువురు సెలబ్రిటీలు షూటింగ్ గ్యాప్ లో ఆటలు ఆడిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా బాలీవుడ్ హీరో షూటింగ్ లో క్రికెట్ ఆడి పోస్ట్ చేసిన వీడియో మాత్రం వైరల్ గా మారింది. ఎందుకంటే హీరో అండర్‌వేర్ లో క్రికెట్ ఆడటం గమనార్హం.
బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ తాజాగా ఓ షూటింగ్ లొకేషన్ లో మరో హీరో అక్షయ్ కుమార్, డ్యాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్య, ఆ షూటింగ్ కి సంబంధించిన పలువురితో కలిసి క్రికెట్ ఆడాడు. అయితే కేవలం అండర్‌వేర్ మాత్రమే వేసుకొని తన బాడీని చూపిస్తూ క్రికెట్ ఆడాడు. ఇలా అండర్‌వేర్ లో క్రికెట్ ఆడటమే కాకుండా ఆ వీడియోని తనే స్వయంగా తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
Also Read : Sukumar – Thabitha : సుకుమార్ 16వ వెడ్డింగ్ యానివర్సరీ.. స్పెషల్ ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేసిన తబిత..
దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. పలువురు టైగర్ ష్రాఫ్ ఫిట్నెస్ ని పొగుడుతుంటే కొంతమంది మాత్రం ఇలా అండర్‌వేర్ లో క్రికెట్ ఆడి వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఏంటని విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి ఒక బాలీవుడ్ స్టార్ హీరో ఇలా అండర్‌వేర్ లో క్రికెట్ ఆడటం వైరల్ గా మారింది.
మీరు కూడా టైగర్ ష్రాఫ్ అండర్‌వేర్ లో క్రికెట్ ఆడిన వీడియో చూసేయండి..
ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్న టైగర్ ష్రాఫ్ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. టైగర్ ష్రాఫ్ చివరగా సింగం అగైన్, బడే మియాన్ చోటే మియాన్ సినిమాల్లో కనిపించాడు. ఈ రెండు సినిమాలు నిరాశపరిచాయి. ఇప్పుడు తనకు బాగా కలిసొచ్చిన బాఘీ ఫ్రాంచైజ్ లో బాఘీ4 చేస్తున్నాడు.
Also See : Anchor Sravanthi : గోవాలో సముద్రపు ఒడ్డున.. చీరలో యాంకర్ స్రవంతి.. ఫొటోలు..