Arya Dhayal entered to tollywood with baby movie song DevaRaaja - Pic Source Youtube
Baby Movie : ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం బేబీ (Baby). రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని సాయి రాజేష్ డైరెక్ట్ చేస్తున్నాడు. నేషనల్ అవార్డు సాధించిన కలర్ ఫోటో సినిమాకి కథని అందించిన సాయి రాజేష్.. ఇప్పుడు దర్శకుడిగా మారి తన మొదటి సినిమాగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఈ సినిమా కూడా గుండెకు హత్తుకునే ప్రేమ కావ్యంలా ఉండబోతుందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది.
Renu Desai : కొంతమంది మన జీవితంలోకి అనుకోకుండా వస్తారు.. రేణుదేశాయ్ పోస్ట్ పవన్ గురించా?
ఈ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్ర యూనిట్.. వరుసగా సినిమాలోని సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో సంగీతానికి పెద్దపీట వేసినట్లు తెలుస్తుంది. విడుదలైన రెండు పాటలు ఒక మ్యాజిక్ ని క్రియేట్ చేశాయి. ఈ సినిమాకి విజయ్ బుల్గేనిన్ సంగీతం అందిస్తున్నాడు. ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా’ అంటూ మొదటి పాటతో అందరి మనసులను కరిగించిన మేకర్స్.. ఇప్పుడు రెండో పాటతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ పాటతో మలయాళ స్టార్ సింగర్ ఆర్య దయాల్ ని (Arya Dhayal) తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు.
తన మ్యాజికల్ వాయిస్ తో ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ వేదికల పై పాటలు పాడి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన ఆర్య టాలీవుడ్ లోని మ్యూజిక్ లవర్స్ కి సుపరిచితురాలే. అయితే ఇప్పటి వరకు ఆర్య తెలుగులోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఇప్పుడు బేబీ సినిమాలో ‘దేవరాజా’ అనే సాంగ్ పాడి అదరగొట్టింది. క్లాసికల్ లిరిక్స్ కి పాప్ మ్యూజిక్ టచ్ ఇచ్చి పాడిన పాట అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇక ఈ పాటతో ఆర్య దయాల్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడంతో.. తెలుగు ఆడియన్స్ కామెంట్స్ తో వెల్‌కమ్ చెబుతున్నారు.