Ashu Reddy : ఇంకో కొత్త కార్ కొన్న అషురెడ్డి.. వేణుస్వామితో స్పెషల్ పూజలు..

తాజాగా దాదాపు 70 లక్షలు విలువ చేసే రేంజ్ రోవర్(Range Rover) కార్ కొనుక్కుంది అషురెడ్డి.

Asdu Reddy bus a New Range Rover Car and special pooja by Venuswamy

Ashu Reddy : టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తో పాపులారిటీ తెచ్చుకున్న అషురెడ్డి ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఫేమస్ అయింది. అప్పటినుండి యాంకర్ గా, నటిగా, పలు టీవీ షోలలో కనిపిస్తూ బిజీగానే ఉంది. యూట్యూబ్ లో వీడియోలు పెడుతూ, సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫొటోలు పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్ మరింత పెంచుకుంటుంది అషురెడ్డి.

అషురెడ్డి ఫ్యామిలిలో ఆల్రెడీ ఒక కార్ ఉండగా, గతంలో బిగ్ బాస్ తర్వాత ఒక కార్ కొనుక్కుంది. తాజాగా దాదాపు 70 లక్షలు విలువ చేసే రేంజ్ రోవర్(Range Rover) కార్ కొనుక్కుంది అషురెడ్డి. అయితే ఈ కొత్త కార్ కి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామితో(Venu Swamy) పూజలు చేయించింది. ఆ వీడియోని అషురెడ్డి తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.

Also Read : Ananya Panday : మాల్దీవ్స్‌లో లైగర్ భామ అనన్య పాండే బర్త్‌డే సెలెబ్రేషన్స్.. బాయ్ ఫ్రెండ్ తో?

నెటిజన్లకు కామెంట్స్ చేసే అవకాశం లేకుండా కామెంట్స్ ఆఫ్ చేసింది అషురెడ్డి. ఇటీవల రెగ్యులర్ గా దుబాయ్, ఆస్ట్రేలియాలో పలు ఈవెంట్స్ లో పాల్గొంది అషు. మొత్తానికి రేంజ్ రోవర్ కార్ కొనడంతో అషురెడ్డి వైరల్ గా మారింది. గతంలో కూడా అషురెడ్డి వేణుస్వామి దగ్గర పూజలు చేయించింది.