Ashu Reddy : తన బ్రేకప్ గురించి చెప్పిన అషు రెడ్డి.. ఆ రోజు నేను వెళ్లకుండా ఉంటే బాగుండు.. డిప్రెషన్ కి వెళ్ళిపోయాను..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అషు తన బ్రేకప్ గురించి చెప్పుకొచ్చింది.

Ashu Reddy Tells about her Love Breakup

Ashu Reddy : సోషల్ మీడియాతో పాపులారిటీ తెచ్చుకున్న అషురెడ్డి ప్రస్తుతం పలు టీవీ షోలతో బిజీగా ఉంది. అప్పుడప్పుడు పలు సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అషు తన బ్రేకప్ గురించి చెప్పుకొచ్చింది.

అషురెడ్డి మాట్లాడుతూ.. అతనితో ఉన్నప్పుడు హ్యాపీగానే ఉన్నాను. కానీ బ్రేకప్ అయింది. ఇద్దరికీ ఈగో ఇష్యూస్. ఎవరూ తగ్గేవాళ్ళం కాదు. తను జాబ్ చేస్తున్నాడు డబ్బులు సంపాదిస్తున్నాడు. నేను కూడా జాబ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాను. నువ్వెంత నేనెంత అని వచ్చింది. అలాగే నా విషయాల్లో అతని ప్రమేయం ఎక్కువైంది. ఒకరోజు ఫ్రెండ్స్ అందరితో బయటకు వెళ్ళాను. అతను కూడా వచ్చాడు. అక్కడ ఓ ఇష్యూ అయింది. ఆ రోజు నేను వెళ్లకుండా ఉంటే బాగుండు అనిపించింది. ఆ తర్వాత మా ఇద్దరికీ బ్రేకప్ అయింది. అప్పుడు చాలా బాధపడ్డాను. బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. అప్పుడు నా పెట్ డాగ్, కొంతమంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేసారు ఆ డిప్రెషన్ నుంచి బయటపడటానికి అని తెలిపింది.

Also Read : Ashu Reddy : అషురెడ్డిలో ఇంత బాధ ఉందా.. బ్రెయిన్ ట్యూమర్.. రాత్రికి రాత్రి సర్జరీ.. హెయిర్ తీసేసి..

ఆ తర్వాత మళ్ళీ ఎవరితో ప్రేమలో పడలేదని, ఆ అబ్బాయి ఇప్పుడు వస్తే బాయ్ అనే చెప్తాను. అతన్ని మళ్ళీ కలిసే అవకాశం లేదు అని తెలిపింది అషురెడ్డి.