Ashwin Babu Next Movie Medico Thriller Vachinavaadu Goutam Announced
Ashwin Babu : రెగ్యులర్ గా సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలతో మెప్పిస్తున్న అశ్విన్ బాబు హీరోగా ఇటీవలే శివమ్ భజే అనే సినిమాతో వచ్చి ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు. తాజాగా నేడు అశ్విన్ బాబు నెక్స్ట్ సినిమాని ప్రకటించారు.
అశ్విన్ బాబు హీరోగా, రియా సుమన్, అయేషా ఖాన్ హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న సినిమా ‘వచ్చినవాడు గౌతమ్’. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై టి. గణపతి రెడ్డి నిర్మాణంలో మామిడాల MR కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా నేడు ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.
Also Read : Good Bad Ugly : అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ట్రైలర్ వచ్చేసింది.. యాక్షన్ అదిరిందిగా..
మెడికల్ యాక్షన్ మిస్టరీగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. బ్లెడ్ అండ్ స్టెతస్కోప్ తో ఉన్న అశ్విన్ బాబు లుక్ ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాలో సాయి రోణక్, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, అభినయ, అజయ్, VTV గణేష్, యెష్నా చౌదరి, సుదర్శన్, శకలక శంకర్.. పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే మిగిలిన షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు.