Asin gives clarity about divorce rumors with her husband
Asin Husband : అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, గజినీ, ఘర్షణ, శివమణి, అన్నవరం.. లాంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు వాళ్లకి దగ్గరైంది ఆసిన్. తెలుగు, తమిళ్, హిందీలో అనేక సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 2016లో ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రాహుల్ శర్మని వివాహం చేసుకొని అప్పట్నుంచి సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం వీరికి ఒక పాప కూడా ఉంది.
Spy Movie : నిఖిల్ ‘స్పై’ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్.. రిలీజ్‌కి ముందే ప్రాఫిట్స్‌లో..
అయితే ఇటీవల ఆసిన్, తన భర్త విడాకులు తీసుకోబోతున్నట్టు, విడివిడిగా ఉంటున్నట్టు బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా ఆసిన్ స్పందిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ స్టోరీ పోస్ట్ చేసింది. ఆసిన్ తన స్టోరీలో.. ప్రస్తుతం మేము మా వేసవి సెలవులకి ఎంజాయ్ చేస్తున్నాము. ఇద్దరం ఒకరికి ఎదురుగా ఒకరు కూర్చొని టిఫిన్ చేస్తూ ఈ వార్తలు చూశాం. ఇవి పూర్తిగా అవాస్తవం, నిరాధార వార్తలు. గతంలో కూడా పెళ్లి సమయంలో మేము బ్రేకప్ చెప్పుకున్నామని వార్తలు రాశారు. ఇలాంటి వార్తలు చూసి 5 నిమిషాల సమయాన్ని వేస్ట్ అయినందుకు నిరాశ చెందుతున్నాను. దయచేసి మంచి వార్తలు రాయండి అని గట్టిగా కౌంటర్ ఇచ్చింది. దీంతో ఆసిన్ తమ విడాకుల వార్తలకు అబద్ధం అని క్లారిటీ ఇచ్చేసింది.