×
Ad

Mahakali: అసురగురు శుక్రాచార్య.. మహాకాళి సినిమా నుంచి ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా?

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న మరో సినిమా (Mahakali)మహాకాళి. ఫీమేల్‌ సూపర్‌ హీరో కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాను పూజ అపర్ణ కొల్లూరు తెరకెక్కిస్తున్నారు.

Asuraguru Shukracharya's first look from the movie Mahakali released

Mahakali: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న మరో సినిమా మహాకాళి(Mahakali). ఫీమేల్‌ సూపర్‌ హీరో కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాను పూజ అపర్ణ కొల్లూరు తెరకెక్కిస్తున్నారు. ప్రశాంత్ వర్మ కథ అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలయ్యింది. హనుమాన్ సినిమా సక్సెస్ తరువాత వస్తున్న సినిమా కావడంతో మహాకాళి సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి.

OG Special show: ఓజీ స్పెషల్ షోలో మెగా ఫ్యామిలీ.. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చూడండి.. ఈ ఫోటోలు చూశారా?

తాజాగా దసరా పండుగ సందర్బంగా ఈ సినిమా నుంచి అసురగురు శుక్రాచార్య ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. శుక్రాచార్యుడి పాత్రలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా నటిస్తున్నాడు. “దేవతల నీడలో శక్తివంతమైన తిరుగుబాటు జ్వాలగా ఎదిగిన శుక్రాచార్యుడు” అనే క్యాప్షన్ ను పోస్టర్ తోపాటు యాడ్ చేశారు. దీంతో సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటున్నాయి. త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

ఇక ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత అధీర అనే సినిమాను కూడా చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాకు కూడా ప్రశాంత్ వర్మ కథను అందిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.