Attack with Slipper on Tamil Star Hero Vijay by Unknown Person at Vijayakanth Funeral
Tamil Hero Vijay : నిన్న ఉదయం ఒకప్పటి తమిళ్ స్టార్ హీరో, DMDK పార్టీ అధినేత విజయ్‌కాంత్(Vijayakanth) మరణించిన సంగతి తెలిసిందే. దీంతో తమిళనాడులో తీవ్ర విషాదం నెలకొంది. అభిమానులు, పార్టీ కార్యకర్తలు విజయ్‌కాంత్ కు నివాళులు అర్పించేందుకు అనేకమంది తరలి వచ్చారు. నిన్న రాత్రి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా విజయ్‌కాంత్ కు నివాళులు అర్పించేందుకు వచ్చారు.
ఈ నేపథ్యంలో తమిళ్ స్టార్ విజయ్ కూడా విజయ్‌కాంత్ కు నివాళులు అర్పించడానికి వచ్చారు. విజయ్‌కాంత్ భౌతికకాయానికి నివాళులు అర్పించి ఆయన్ని చూస్తూ విజయ్ ఎమోషనల్ అయ్యారు. అనంతరం విజయ్ తిరిగి తన కార్ వైపు వెళ్తుండగా అక్కడ ఉన్న జనాల్లోంచి ఎవరో విజయ్ పైకి చెప్పు విసిరారు. అక్కడున్న పోలీసులు, విజయ్ కి రక్షణగా వచ్చిన బౌన్సర్లు కూడా ఆ చెప్పుని గమనించకపోవడంతో అడ్డుకోలేకపోయారు.
Also Read : Thaman : ఆ డీజే సాంగ్‌ని కాపీ కొట్టిన థమన్.. ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ పై మీమ్స్..
దీంతో విజయ్ పైకి చెప్పు పడిన వీడియో వైరల్ గా మారింది. విజయ్ అభిమానులతో పాటు అందరూ ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తున్నారు. విజయ్ పైకి చెప్పు విసిరిన వాళ్ళని పట్టుకొని శిక్షించాలని, ఇలాంటి వాటిని ఈజీగా వదిలెయ్యకూడదని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ ఫ్యాన్స్ అయితే ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.