Sonu Sood – Bangladesh : బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు.. మహిళ వీడియో వైరల్.. స్పందించిన సోనూసూద్..

గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ అల్లర్లు చెలరేగుతున్న సంగతి తెలిసిందే.

Attacks on Bangladesh Hindus Women Video goes Viral SonuSood Reacts

Sonu Sood – Bangladesh : గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ అల్లర్లు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. రిజర్వేషన్స్ అంశంపై మొదలయిన నిరసనలు హింసాత్మక అల్లర్లుగా మారాయి. ఇప్పటికే బంగ్లాదేశ్ దేశ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోగా ఆమె ఇంటిని అల్లరిమూకలు కొల్లగొట్టాయి. అయితే ఈ దాడుల ప్రభావం బంగ్లాదేశ్ లోని మైనార్టీ హిందువులపై పడింది.

కొంతమంది అక్కడ హిందువులపై దాడులు చేస్తున్నారు. ఆలయాలు కూలగొడుతున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ లో దాడికి గురయిన ఆలయాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను, అక్కడ హిందువుల పరిస్థితి వివరిస్తూ ఓ మహిళా వీడియో చేసి మమ్మల్ని కాపాడండి, ఇండియాకు తీసుకెళ్లండి అంటూ వేడుకుంది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో నటుడు సోనూసూద్ వరకు వెళ్లడంతో దీనిపై స్పందించాడు.

Also Read : Raviteja – Siddhu : రవితేజ సినిమాలో డీజే టిల్లు నిజమే అంట.. ఫైట్ సీన్ లో..?

నటుడు సోనూసూద్ ఆ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. బంగ్లాదేశ్ నుంచి మన భారతీయులను తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం కూడా చేస్తాను. మీరు ఇక్కడికి వచ్చి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. ఇది కేవలం మన ప్రభుత్వ బాధ్యతే కాదు, మనందరి బాధ్యత అని సోనూసూద్ స్పందించారు. బంగ్లాదేశ్ లో చిక్కుకున్న హిందువులను కాపాడాలని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు