Ram Charan Peddi Movie Update
బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ ఆడియో రైట్స్‌కు భారీ ధర దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ హక్కులను టీ సిరీస్ రూ.35 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రెహమాన్, చెర్రీ కాంబినేషన్‌లో ఇది తొలి సినిమా. ‘పెద్ది’ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్లు ఈ సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. రామ్ చరణ్ పుట్టిన రోజు వేళ (మార్చి 27న) ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
ఇక ఏప్రిల్ 6న (శ్రీరామనవమి) ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేస్తామని ఆ మూవీ టీమ్ ప్రకటన చేసింది. ఆర్ఆర్ఆర్, గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తోంది.
శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్నాయి. ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ వస్తుంది.
Global star @AlwaysRamCharan‘s Next #PEDDI Audio Rights Sold to @TSeries for a MASSive Price ❤️🔥
A @BuchiBabuSana Film.
An @arrahman Musical.The Sound of PEDDI Reverberates from this Apr 6th with #PeddiFirstShot 🔥🔥🔥 pic.twitter.com/PEigKSLVGG
— Trends RamCharan ™ (@TweetRamCharan) March 31, 2025