Latha Mangeshkar : లతా మంగేష్కర్ చికిత్స కోసం తన సంపాదనను దానం చేసిన ఆటో డ్రైవర్

లతా మంగేష్కర్ దాదాపు గత 10 రోజులుగా ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ముంబైలో నివసించే సత్యవాన్ గీతే లతా మంగేష్కర్‌కి పెద్ద అభిమాని. అతను లతామంగేష్కర్‌ను....

Latha Mangeshkar : లతా మంగేష్కర్ చికిత్స కోసం తన సంపాదనను దానం చేసిన ఆటో డ్రైవర్

Latha Mangeshkar

Updated On : January 23, 2022 / 7:57 AM IST

Latha Mangeshkar :  సింగర్ లతా మంగేష్కర్ తన పాటలతో, తన మధురమైన గాత్రంతో ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఆమెకి అభిమానులు ఉన్నారు. ఇటీవల ఆమెకి కరోనా సోకడంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. వయో భారంతో ఆరోగ్య సమస్యలు కూడా ఉండటంతో ఇంకా icu లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఆమె ఆసుపత్రిలో చేరిన రోజు నుంచి ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు, ప్రేక్షకులు కోరుకుంటూ ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబైకి చెందిన ఓ ఆటో డ్రైవర్.. లతా మంగేష్కర్ చికిత్స కోసం తన సంపాదనను దానం చేశాడు.

Sri Reddy : ‘క్షమించండి అంజనమ్మ’.. చిరంజీవి తల్లిపై శ్రీరెడ్డి వ్యాఖ్యలు..

లతా మంగేష్కర్ దాదాపు గత 10 రోజులుగా ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ముంబైలో నివసించే సత్యవాన్ గీతే లతా మంగేష్కర్‌కి పెద్ద అభిమాని. అతను లతామంగేష్కర్‌ను సరస్వతి దేవి రూపంగా కూడా భావిస్తాడు. అతను ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతని ఆటోపై మొత్తం లతామంగేష్కర్‌ చిత్రాలు, ఆమె చెప్పిన మాటలు ఉంటాయి. లతా మంగేష్కర్ ఆసుపత్రిలో చేరారనే వార్త తెలిసినప్పటినుంచి ఆమె కోలుకోవాలని ప్రార్థనలు చేస్తూ అతనికి వచ్చిన సంపాదనని ఆమె చికిత్స కోసం దానం చేస్తున్నాడు సత్యవాన్. ఇది తెలిసిన మిగతా అభిమానులు అతన్ని అభినందిస్తున్నారు.