Avantika Vandanapu : హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న అవంతిక వందనపు..

టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ అవంతిక వందనపు ఇటీవల బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Avantika Vandanapu : టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ అవంతిక వందనపు ఇటీవల బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన అవంతిక ప్రస్తుతం హాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. తన ఫ్యామిలీ అక్కడే అమెరికాలో సెటిల్ అవ్వడంతో అవంతిక కూడా నటననే కెరీర్ గా తీసుకొని వెళ్తుంది.

హాలీవుడ్ లో స్పిన్, సీనియర్ గర్ల్, మీన్ గర్ల్స్.. ఇలా పలు సినిమాలతో మెప్పించింది. ఇటీవల మీన్ గర్ల్స్ రిలీజయినప్పుడు తన పాత్రతో, తను మాట్లాడే అమెరికా యాక్సెంట్ తో బాగా వైరల్ అయింది. ఆమె యాక్సెంట్ పై పలువురు విమర్శలు చేయడంతో ఓ ఇంటర్వ్యూలో కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం అవంతిక వందనపు హాలీవుడ్ లో హీరోయిన్ గా ఎదగాలని చూస్తుంది. తాజాగా ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ అవంతిక వందనపుకు ఓ ప్రతిష్టాత్మక అవార్డుని అందించింది.

Also Read : Vijay Deverakonda : ‘ఫ్యామిలీ స్టార్’ అయిపోయింది.. నెక్స్ట్ సినిమా షూట్ మొదలుపెట్టిన విజయ్.. ఎక్కడో తెలుసా?

అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ(Harvard University) అవంతికకు ‘సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అనే అవార్డుని ప్రకటించింది. నిన్న సాయంత్రం అవంతిక ఈ అవార్డు అందుకుంది. ఈ అవార్డు అందుకున్న అనంతరం అవంతిక మాట్లాడుతూ.. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఈ అవార్డు అందుకోవడం చాలా గర్వంగా ఉంది. ఇది కేవలం నా వర్క్ కి మాత్రమే ఇచ్చిన అవార్డు కాదు. బోర్డుర్లు దాటి సినిమా కథలు చెప్పడం, గ్లోబల్ సినిమాలో ఇండియా భాగం అవ్వడం వల్ల వచ్చిన ఈ అవార్డుకి మరింత విలువనిస్తుంది అని తెలిపింది. దీంతో అవంతిక మరోసారి వైరల్ గా మారింది. పలువురు నెటిజన్లు ఆమెకు కంగ్రాట్స్ చెప్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు