Vijay Deverakonda : ‘ఫ్యామిలీ స్టార్’ అయిపోయింది.. నెక్స్ట్ సినిమా షూట్ మొదలుపెట్టిన విజయ్.. ఎక్కడో తెలుసా?

విజయ్ దేవరకొండ తాజాగా తన నెక్స్ట్ సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు.

Vijay Deverakonda : ‘ఫ్యామిలీ స్టార్’ అయిపోయింది.. నెక్స్ట్ సినిమా షూట్ మొదలుపెట్టిన విజయ్.. ఎక్కడో తెలుసా?

Vijay Devarakonda Next Movie under Gowtam Tinnanuri Direction Shoot Started

Updated On : April 16, 2024 / 10:50 AM IST

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ఇటీవల ఫ్యామిలీ స్టార్(Family Star) సినిమాతో వచ్చి థియేటర్స్ లో సందడి చేసాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించినప్పటికీ కలెక్షన్స్ పరంగా అంచనాలు అందుకోలేకపోయింది. ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజయి పది రోజులు దాటిపోయింది. థియేటర్స్ లోకి వేరే సినిమాలు రావడం, ఫ్యామిలీ స్టార్ కి జనాలు తగ్గిపోవడంతో థియేటర్స్ నుంచి మెల్లిగా బయటకి వచ్చేస్తుంది. ఇన్నాళ్లు ఫ్యామిలీ స్టార్ తో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ తాజాగా తన నెక్స్ట్ సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు.

విజయ్ దేవరకొండ – జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి(Gowtam Tinnanuri)దర్శకత్వంలో, సితార ఎంటర్టైన్మెంట్లో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. పీరియాడిక్ స్పై యాక్షన్ జానర్ లో ఈ సినిమా ఉండబోతుంది. ఆల్రెడీ శ్రీలీల హీరోయిన్ గా సినిమా ఓపెనింగ్ కూడా జరిగింది. కానీ డేట్స్ అడ్జస్ట్ అవ్వక శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు సమాచారం. శ్రీలీల(Sreeleela) ప్లేస్ లో మమిత బైజు, భాగ్యశ్రీ భోర్సే.. పేర్లు వినిపించాయి కానీ హీరోయిన్ ఎవరు అనేది ఇంకా క్లారిటీ రాలేదు.

Also Read : Apoorva Srinivasan : సైలెంట్‌గా పెళ్లి చేసేసుకున్న టాలీవుడ్ భామ.. వైరల్ అవుతున్న పెళ్లి ఫొటోలు..

తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలైంది. నేటి నుంచి హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో యాక్షన్ సీన్స్ షూటింగ్ చేస్తున్నారు. మొదటిసారి స్పై యాక్షన్ జానర్ లో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో అయినా విజయ్ మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి. ఇక ఈ సినిమా వచ్చే సంవత్సరం రానున్నట్టు తెలుస్తుంది.