Bollywood: ఒకప్పుడు రైళ్లలో పాటలు పాడుకునేవాడు.. బాలీవుడ్ లో స్టార్ హీరో అయ్యాడు.. రష్మికతో సినిమా చేస్తున్నాడు!

సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సక్సెస్ అవడం అంటే చాలా కష్టం. అందులోనూ బాలీవుడ్(Bollywood) లో మరీ కష్టం. అక్కడ నేపోటిజం డామినేషన్ ఎక్కువగా ఉంటుంది.

ayushmann khurrana is making his bollywood debut after a gap of two years

Bollywood: సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సక్సెస్ అవడం అంటే చాలా కష్టం. అందులోనూ బాలీవుడ్ లో మరీ కష్టం. అక్కడ నేపోటిజం డామినేషన్ ఎక్కువగా ఉంటుంది అని మనం వింటూనే ఉంటాం. అలాంటిది, ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇతను స్టార్ హీరో అయ్యాడు. ఇప్పుడు స్త్రీ 2, చావా లాంటి బ్లాక్ బస్టర్స్ అందించిన ప్రముఖ సంస్థ మాడాక్ లో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఆ స్టార్ మరెవరో కాదు ఆయుష్మాన్ ఖురానా. ఈ హీరో గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.

Malavika Mohanan: ఆ క్షణాలు చాలా మధురం.. ప్రభాస్ హీరోయిన్ క్రేజీ కామెంట్స్.. ఫ్లోలో రాజాసాబ్ అప్డేట్ కూడా ఇచ్చేసిందిగా!

విక్కీ డోనార్, ఆర్టికల్ 15, దమ్ లగా కే హైషా, బదాయి హో, అంధాధున్ వంటి చిత్రాలతో(Bollywood) వరుస సూపర్ హిట్స్ అందుకున్నాడు. అయితే, చేసిన సినిమాలు తక్కువే కానీ, తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ మనసులు గెలుచుకున్నాడు ఈ హీరో. ఆయుశ్మాన్ ఖురానా గురించిన ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే, ఈ హీరో కేవలం నటుడిగానే కాదు సింగర్ కూడా పరిచయమే. సద్ది గాలి, పానీ ద రంగ్, నైనా ద క్యా కసూర్ వంటి సూపర్ హిట్ సాంగ్స్ పాడారు ఆయన. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, ఈ హీరో మేరీ ప్యారీ బిందును ప్రమోట్ చేస్తున్నప్పుడు.. తన స్నేహితులతో కలిసి రైళ్లలో ఎలా పాటలు పాడేవాడు. అలా తన కళాశాలకు సంబందించిన మనీ సమకూర్చుకునేవాడట.

అలాంటి ఈ హీరో, రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నాడు. ఇది మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగం కాబోతున్నాడు. ఆ సినిమానే “థమా”. ఈ సినిమాలో ఆయుశ్మాన్ ఖురానాతో నేషనల్ క్రష్ రష్మిక కూడా నటించనుంది. పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమాను దర్శకుడు ఆదిత్య సర్పోత్దార్ తెరేకేక్కిస్తున్నారు. హారర్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి చాలా గ్యాప్ తరువాత ఆయుశ్మాన్ ఖురానా చేస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.