×
Ad

Thamma Review : ‘థామా’ మూవీ రివ్యూ.. రష్మిక మందన్న ఫస్ట్ హారర్ సినిమా ఎలా ఉంది..?

మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ లో స్త్రీ, స్త్రీ 2, ముంజ్య, భేడియా.. సినిమాలతో పాటు ఈ థామా సినిమాని కలిపి సరికొత్త సినిమాటిక్ యూనివర్స్ సృష్టించారు. (Thamma Review)

Thamma Review

Thamma Review : రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా జంటగా పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్దిఖీ.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన బాలీవుడ్ సినిమా థామా. మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ బ్యానర్ పై దినేష్ విజయన్, అమర్ కౌశిక్ నిర్మాణంలో ఆదిత్య సర్పోదర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. థామా సినిమా నేడు అక్టోబర్ 21న థియేటర్స్ లో రిలీజయింది.(Thamma Review)

కథ విషయానికొస్తే.. బేతాళులు మనుషుల రక్తం తాగేవాళ్ళు. వీళ్లకు చావు మాములుగా రాదు. ఓ సంఘటనతో వాళ్ళు మనుషుల రక్తం తాగడం మానేస్తారు. కానీ ఆ నియమం ఉల్లంఘించినందుకు వాళ్ళ థామా(లీడర్ అని అర్ధం) యక్షసాన్(నవాజుద్దీన్ సిద్ధికి) ని బంధీ చేస్తారు. అతను మనిషి రక్తం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఎవరైనా బేతాళులు మనిషిని కొరికి బేతాళుడుగా మారిస్తే యక్షసాన్ కి స్వేచ్ఛ దొరుకుతుంది.

కొన్నేళ్ల తర్వాత.. జర్నలిస్ట్ అలోక్(ఆయుశ్మాన్ ఖురానా) ఓ సారి అడవిలో ట్రెక్కింగ్ కి వెళ్తే ఎలుగుబంటి దాడి చేయడంతో దారి తప్పి గాయపడి స్పృహతప్పి పడిపోతాడు. అలోక్ ని తాడకా(రష్మిక మందన్న)కాపాడుతుంది. తాడకా బేతాళుల సంతతికి చెందింది. తాడకా అలోక్ కి దగ్గరవుతుంది. కానీ అతన్ని బేతాళులు చంపాలని చూస్తారు. దీంతో తాడకా అలోక్ ని తీసుకొని పారిపోయి అలోక్ ఇంటికి వస్తుంది. వీళ్ళని వెతుక్కుంటూ కొంతమంది యక్షసాన్ మనుషులు వస్తారు.

ఓ యాక్సిడెంట్ లో అలోక్ చనిపోవడంతో తాడకా తట్టుకోలేక అతన్ని కరిచి, అతను రక్తం తాగి బేతాళుడిగా మార్చి బతికిస్తుంది. అలోక్ కూడా బేతాళుడిగా మారిపోవడంతో అతనికి ఎదురైన ఇబ్బందులు ఏంటి? అలోక్ బేతాళుడిగా మారిపోయినట్టు వాళ్ళ ఇంట్లో తెలిస్తే ఏం జరిగింది? బేతాళులు మామూలు జనాల్లో ఇంకా ఎంతమంది ఉన్నారు? నియమం తప్పినందుకు తాడకాని బంధిస్తారా? యక్షసాన్ ని అలోక్ ఎదిరిస్తాడా? బేతాళులకు కొత్త థామా ఎలా వస్తారు? అసలు ఈ బేతాళులు ఎవరు? ఈ కథలోకి తోడేలు ఎలా వస్తుంది? స్త్రీ, ముంజ్య, భేడియా.. ఈ సినిమాలతో థామాని ఎలా లింక్ చేసారు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read : Oka Manchi Prema Katha Review : ‘ఒక మంచి ప్రేమ కథ’ మూవీ రివ్యూ.. పేరెంట్స్ చివరి దశలో..

సినిమా విశ్లేషణ..

మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ లో స్త్రీ, స్త్రీ 2, ముంజ్య, భేడియా.. సినిమాలతో పాటు ఈ థామా సినిమాని కలిపి సరికొత్త సినిమాటిక్ యూనివర్స్ సృష్టించారు. ఫస్ట్ హాఫ్ అంతా భేడియా సినిమానే గుర్తుకొస్తుంది. ఇలాంటివి హాలీవుడ్ లో చాలా సినిమాలు చూసేసాం. అనుకోకుండా హీరో తప్పిపోవడం, వేరే జాతికి చెందిన హీరోయిన్ తో ప్రేమ, కొన్ని సంఘటనలతో హీరో కూడా అలా మారిపోవడం.. ఇదంతా రొటీన్ గానే అక్కడక్కడా కామెడీతో సాగదీశారు. సెకండ్ హాఫ్ మాత్రం హీరో కూడా బేతాళుడిగా మారిపోయిన తర్వాత కాస్త ఆసక్తిగా మారుతుంది.

మధ్యలో భేడియా సినిమా నుంచి వరుణ్ ధావన్ తోడేలు పాత్రని తీసుకురావడం, స్త్రీ, ముంజ్య సినిమాలకు కనెక్ట్ చేసే సీన్స్ బాగుంటాయి. తోడేలు – బేతాళుడు ఫైట్ మాత్రం అదిరిపోతుంది. లవ్ ఎమోషన్ తో పాటు తండ్రి ఎమోషన్ కూడా బాగానే వర్కౌట్ అయింది. అక్కడక్కడా కామెడీ కూడా వర్కౌట్ అయింది. సినిమా అంతా కాకుండా హారర్ అక్కడక్కడా కొన్ని సీన్స్ తో భయపెట్టారు. చివర్లో మళ్ళీ ఇంకో సినిమాకు లీడ్ ఇవ్వడం గమనార్హం. థామా పార్ట్ 2 లేదా కొత్త టైటిల్ తో ఆ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇక రష్మిక, మలైకా అరోరా, నోరా ఫతేహి లతో మూడు స్పెషల్ సాంగ్స్ ని పెట్టడం గమనార్హం. కొన్ని సీన్స్ లో ఇటీవల వచ్చిన లోక సినిమా, వోల్వరిన్, మార్వెల్ సినిమాలు కూడా గుర్తుకొస్తాయి.

నటీనటుల పర్ఫార్మెన్స్..

ఆయుష్మాన్‌ ఖురానా అలోక్‌ పాత్రలో బాగానే నటించాడు. రష్మిక మందన్న బేతాళిని పాత్రలో తన పర్ఫార్మెన్స్ తో మెప్పిస్తుంది. ఉన్నట్టుండి సడెన్ గా బేతాళినిగా మారడం, అలా మారేటప్పుడు తన హావభావాలు చూస్తే పాత్రలో ఒదిగిపోయింది అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ తో పాటు అందాలు కూడా బాగానే ఆరబోస్తూ లిప్ లాక్ సీన్స్ లో నటించింది.

ఇక నవాజుద్దీన్ సిద్ధిఖీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాత్రలో అయినా ఒదిగిపోయే సిద్ధిఖీ ఇందులో నవ్విస్తూనే యాక్షన్ సీక్వెన్స్ లో భయపెడతాడు. పరేశ్‌ రావల్‌ బాగానే నవ్విస్తూ తండ్రి ఎమోషన్ తో మెప్పిస్తారు. ఫైసల్ మాలిక్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

Also Read : Anandalahari Review : ‘ఆనందలహరి’ సిరీస్ రివ్యూ.. వెస్ట్ గోదావరి అమ్మాయి – ఈస్ట్ గోదావరి అబ్బాయి పెళ్లి చేసుకుంటే..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. చాలా వరకు కథ రాత్రి పూట జరగడంతో దానికి తగ్గట్టు పర్ఫెక్ట్ లైటింగ్ తో విజువల్స్ చూపించారు. కొన్ని అడవి లొకేషన్స్, సెట్స్ కూడా బాగానే వర్కౌట్ చేశారు. కథ, కథనం పాతదే అయినా కొన్ని సీన్స్ తో సినిమాటిక్ యూనివర్స్ తో కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. తెలుగు డబ్బింగ్, డైలాగ్స్ బాగానే కుదిరాయి. గ్రాఫిక్ వర్క్స్ కూడా బాగున్నాయి. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు అని తెలుస్తుంది.

మొత్తంగా ‘థామా’ సినిమా బేతాళులు – మనిషి కి మధ్య జరిగే కథ. హారర్ కామెడీ సినిమాలను ఇష్టపడేవాళ్లు చూడొచ్చు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..