శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్ – ఫస్ట్‌లుక్
ఆయుష్మాన్ ఖురానా హీరోగా ‘శుభ్ మంగళ్ సావధాన్’కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’ ఫస్ట్‌లుక్ రిలీజ్..

ఆయుష్మాన్ ఖురానా హీరోగా ‘శుభ్ మంగళ్ సావధాన్’కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’ ఫస్ట్‌లుక్ రిలీజ్..
డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో సినిమాలు చేస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు నేషనల్ అవార్డ్ గెలుచుకున్న బాలీవుడ్ యువ నటుడు ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘బాలా’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంపర కొనసాగిస్తోంది.
ఆయుష్మాన్ నటిస్తున్న కొత్త సినిమా ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. ‘శుభ్ మంగళ్ సావధాన్’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను టీ-సిరీస్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Read Also : డిసెంబర్ 6న ‘‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’’
‘శుభ్ మంగళ్ సావధాన్’ సినిమాకి రైటర్‌గా వర్క్ చేసిన హితేష్ కేవల్యా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్‌తో రైల్వే ఫ్లాట్ ఫామ్‌పై పరిగెడుతున్న ఆయుష్మాన్ లుక్ ఆకట్టుకుంటోంది. 2020 ఫిబ్రవరి 21న ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’ విడుదల కానుంది.