లండన్ లో బాహుబలి టీం సందడి

  • Publish Date - October 19, 2019 / 05:15 AM IST

బాహుబలి టీం లండన్ లో హంగామా చేస్తోంది. మూవీలోని నటీనటులతోపాటు నిర్మాత, ఇతర టెక్నీషియన్స్ ఇప్పుడు బ్రిటన్ చేసుకున్నారు. దీనికి కారణం లేకపోలేదు. అక్టోబర్ 19వ తేదీన లండన్ లోనే ప్రతిష్టాత్మకమైన రాయల్ ఆల్బర్ట్ థియేటర్లో బాహుబలి మూవీ ప్రదర్శించబోతున్నారు. దీని కోసం బాహుబలి టీం అంతా లండన్ చేరుకున్నారు.

ఈ షోకు లండన్ లోని ప్రముఖులు అందరూ హాజరు అవుతుండటం విశేషం. ఓ ఇండియన్ మూవీ అందులోనూ తెలుగు సినిమా ఆ థియేటర్ లో ప్రదర్శించటం విశేషం. కీరవాణి లైవ్ మ్యూజికల్ పెర్ఫార్మన్స్ స్పెషల్ ఎట్రాక్షన్ కాబోతున్నది.

లండన్ లో బాహుబలి టీం సందడికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు నటులు. ది బెస్ట్ ఇవినింగ్ విత్ బెస్ట్ పీపుల్ అని టాగ్ చేశారు. ఈ టీంలో దర్శకుడు రాజమౌళితోపాటు ప్రభాస్, రాణా, అనుష్క, నిర్మాత యార్లగడ్డ కూడా ఉన్నారు.