Babu Mohan Interesting Comments on Silk Smitha and her Gift
Babu Mohan – Silk Smitha : ఎన్నో సినిమాలలో కామెడీతో మనల్ని నవ్వించిన బాబు మోహన్ గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలో పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు బాబు మోహన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సిల్క్ స్మిత తో జరిగిన ఓ సంఘటన పంచుకున్నారు.
సిల్క్ స్మిత ఎన్నో సినిమాల్లో తన డ్యాన్సులు, నటనతో మెప్పించి అప్పట్లో కుర్రాళ్లకు కళల రాణిలా నిలిచి అర్దాంతరంగా కనుమరుగైంది. ఇప్పటికి సిల్క్ స్మిత నర్తించిన పాటలు వినిపిస్తూనే ఉంటాయి. బాబు మోహన్ – సిల్క్ స్మిత కూడా కలిసి పలు సినిమాల్లో నటించారు.
Also Read : Emoji : ‘ఎమోజీ’ మూవీ రివ్యూ.. లవ్ బ్రేకప్ అయిన ఇద్దరు పెళ్లి చేసుకొని..
బాబు మోహన్ మాట్లాడుతూ.. ఒక ఫంక్షన్ కి దుబాయ్ కి వెళ్ళాము. సిల్క్ స్మిత కూడా వచ్చింది. తను నన్ను బాస్ అని పిలిచేది. బాస్ మనం షాపింగ్ కి వెళ్దాం అంటే నేనెందుకు నువ్వు నీ లిప్ స్టిక్స్, మేకప్ కిట్స్ కొనుక్కుంటావు నేను రాను అన్నాను. కాదు నువ్వు రావాలి, నేను పర్మిషన్ తీసుకున్నాను అని చెప్పింది. సరే అని వెళ్లి షాప్ బయటే ఉన్నాను నేను. తను వెళ్లి షాపింగ్ చేసుకొచ్చింది. వచ్చేటప్పుడు ఓ బ్లాక్ కళ్ళజోడు పెట్టుకొని వచ్చి ఎలా ఉంది అని అడిగింది. నేను సూపర్ అని చెప్పా. నిజంగా సూపర్ ఉందా కొనేస్తాను అంది. నేను కొనుక్కో అన్నాను. లోపలికి వెళ్లి కళ్లజోడు కొనేసా అనుకుంటూ వచ్చిది. మీరు పెట్టుకోండి బాస్ ఒకసారి అని నాకు పెట్టింది ఆ కళ్ళజోడు. సూపర్ అంది. అదేంటి నాకు బాగోదు నీకు సూపర్ అంటే.. చాలా బాగుంది అందుకే మీ కోసం కొన్నాను అంది. అలా సిల్క్ స్మిత నాకు కళ్లద్దాలు బహుమతి ఇచ్చింది. ఆ కళ్లద్దాలు తను చనిపోయేదాకా దాచిపెట్టుకున్నా అని తెలిపారు.
Also Read : Manchu Manoj : మంచు ఫ్యామిలీలో వివాదాల వేళ.. భార్య గురించి మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్..
అలాగే.. సిల్క్ స్మిత షూటింగ్స్ గ్యాప్ లో బ్లాక్ కళ్ళజోడు పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని కుర్చీలో కూర్చుంటుంది. ఎందుకు ఎప్పుడూ ఆ కళ్ళజోడు పెట్టుకుంటావు, నిద్రపోతున్నావా, ఎవర్ని చూస్తున్నావా అర్ధం కాదు అని అడిగితే నన్ను అందరూ చూస్తారు కదా, కొంతమంది దొంగ చూపులు చూస్తారు అందుకే ఈ కళ్ళజోడు పెట్టుకొని ఎవరెవరు నన్ను చూస్తున్నారో చెక్ చేస్తాను అని చెప్పింది. నాకు రెస్పెక్ట్ ఇచ్చేది. ఇద్దరికీ షాట్ గ్యాప్ ఉంటే ఆ దగ్గరికి వచ్చి కూర్చునేది అని సిల్క్ స్మిత గురించి చెప్పారు బాబు మోహన్.