Manchu Manoj : మంచు ఫ్యామిలీలో వివాదాల వేళ.. భార్య గురించి మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్..
తాజాగా మంచు మనోజ్ నిన్న రాత్రి తన భార్య మౌనికపై ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసాడు.

Manchu Manoj Shares Emotional Post on her Wife
Manchu Manoj : గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలిలో గొడవలు అవుతున్న సంగతి తెలిసిందే. మంచు కుటుంబ వివాదాలు మీడియాకు, కలెక్టర్ వరకు వెళ్లాయి. మోహన్ బాబు, విష్ణు ఇవి ఆస్తి గొడవలు అంటే మంచు మనోజ్ ఇది కాలేజీ కోసం అని, వాళ్ళు చేసే అక్రమాలు ప్రశ్నిస్తున్నందుకు అని అంటున్నారు. ఇప్పటికే ఒకరిపై ఒకరు కేసులు, కలెక్టర్ వద్ద ఫిర్యాదులతో ఈ వివాదాలు సాగుతున్నాయి.
గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తున్న క్రమంలో తాజాగా మంచు మనోజ్ నిన్న రాత్రి తన భార్య మౌనికపై ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసాడు. 2023 మార్చ్ 3న మంచు మనోజ్ తను ప్రేమించిన అమ్మాయి భూమా మౌనికను పెళ్లి చేసుకున్నాడు. వారి పెళ్లి జరిగి నిన్నటితో రెండేళ్లు పూర్తవ్వడంతో తమ వెడ్డింగ్ యానివర్సరీ పై తన భార్యపై ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసాడు మంచు మనోజ్.
Also See : Sitara Ghattamaneni : మహేష్ కూతురు.. సితార పాప క్యూట్ ఫోటోలు చూశారా?
తన భార్య, పిల్లలతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. రెండేళ్ల క్రితం నా లైఫ్ లోనే బెస్ట్ డెసిషన్ తీసుకున్నాను. నా ప్రపంచాన్నే మార్చేసిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. మౌనిక.. నువ్వు నా లైఫ్ లోకి వచ్చిన క్షణం నుంచి నేను ఎప్పుడూ చూడని ప్రేమని తీసుకొచ్చావు. నేను డెస్టినీని నమ్మేలా చేసావు. రెండేళ్లలో మనం మన ఇంటిని ప్రేమ, నవ్వులు, ఇద్దరు బ్యూటిఫుల్ లిటిల్ కిడ్స్ ధైరవ్, MM పులిలతో నింపాము. వాళ్లకు బెస్ట్ మదర్ లా ఉంటూ నీతో రోజూ మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడేలా చేస్తున్నావు. మనం ఎన్నో ఎత్తుపల్లాలు చూసాము. సక్సెస్ లు, ఫెయిల్యూర్ లు చూసాము. కానీ ఒక్కటి మాత్రం మారలేదు. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్, నా బిగ్గెస్ట్ సపోర్టర్, నాకు అన్ని నువ్వే. ఈ రెండేళ్లు నాకు చూపించిన ప్రేమ నీతో జీవితకాలం ఉన్నా సరిపోదు. హ్యాపీ యానివర్సరీ మున్ని. టైంతో పాటు మన ప్రేమను పెంచే మరిన్ని కలలు, మరిన్ని సాహసాలు చేయాలి అని రాసుకొచ్చారు మంచు మనోజ్.
Also Read : Allu Arjun : సొంత బ్యానర్ లో అల్లు అర్జున్ సినిమా ఉండదా? 1000 కోట్లు రిస్క్ చేయాలి అన్న బన్నీ వాసు..
దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు వీరికి వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలిపారు. మౌనిక కూడా తన సోషల్ మీడియాలో మనోజ్ కి హ్యాపీ యానివర్సరీ చెప్తూ పోస్ట్ చేసింది. మౌనిక పోస్ట్ కి మంచు లక్ష్మి కూడా హ్యాపీ యానివర్సరీ అంటూ కామెంట్ చేసింది. మరి మంచు కుటుంబ వివాదాలు ఎప్పుడు ఆగుతాయో చూడాలి. ఇక మనోజ్ త్వరలో భైరవం, మిరాయ్ సినిమాలతో రానున్నాడు.