Allu Arjun : సొంత బ్యానర్ లో అల్లు అర్జున్ సినిమా ఉండదా? 1000 కోట్లు రిస్క్ చేయాలి అన్న బన్నీ వాసు..

తాజాగా అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్, గీత ఆర్ట్స్ నిర్మాత బన్నీ వాసు అల్లు అర్జున్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Allu Arjun : సొంత బ్యానర్ లో అల్లు అర్జున్ సినిమా ఉండదా? 1000 కోట్లు రిస్క్ చేయాలి అన్న బన్నీ వాసు..

Geetha Arts Producer Bunny Vasu Interesting Comments on Allu Arjun

Updated On : March 4, 2025 / 6:57 AM IST

Allu Arjun : అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా టాప్ హీరోల్లో ఒకరు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకొని నేషనల్ అవార్డు సాధించి ఒక్కసారిగా నేషనల్ వైడ్ స్టార్ అయ్యాడు. ఇక పుష్ప 2 సినిమాతో ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేసాడు. ఆ సినిమా భారీ విజయం సాధించింది. ఏకంగా 1850 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి అత్యధిక కలెక్షన్స్ సాధించిన రెండో ఇండియన్ సినిమాగా నిలిచింది.

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ స్థానం, స్థాయి రెండూ పెరిగాయి. ఆయన నెక్స్ట్ సినిమా కోసం అంతా ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో భారీ మైథాలజీ సినిమా చేయనున్నారు. అది హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఉండబోతుంది. సినిమాని అయితే ప్రకటించారు కానీ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు మొదలవుతుంది తెలియదు. ఇక మరో సినిమా కమర్షియల్ డైరెక్టర్ అట్లీతో ఉండబోతుంది. ఒకవేళ త్రివిక్రమ్ సినిమా లేట్ అయితే ముందే అట్లీతో సినిమా చేయనున్నాడు అల్లు అర్జున్ అని టాక్ వినిపిస్తుంది. ఈ రెండిటి తర్వాత సందీప్ రెడ్డి వంగతో సినిమా చేయనున్నాడు బన్నీ.

Also See : Divyabharathi : మొదటిసారి తెలుగు ఈవెంట్లో మెరిసిన దివ్యభారతి.. ఫొటోలు వైరల్..

తాజాగా అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్, గీత ఆర్ట్స్ నిర్మాత బన్నీ వాసు అల్లు అర్జున్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా చావాని గీత ఆర్ట్స్ తెలుగులో రిలీజ్ చేయబోతుంది. ఈ క్రమంలో బన్నీ వాసు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో మీడియాతో మాట్లాడగా అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్, ఆయనతో మీ సొంత బ్యానర్ లో మళ్ళీ సినిమా ఉంటుందా అనే ప్రశ్న ఎదురైంది.

దీనికి బన్నీ వాసు సమాధానమిస్తూ.. ఇప్పుడు ఆయన డేట్స్ మాకు దొరకాలి అన్నా ఒక మూడు నాలుగేళ్లు ఎదురు చూడాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇప్పుడు బన్నీతో సినిమా చేయాలంటే కనీసం 1000 కోట్లు రిస్క్ చేయాలి. అరవింద్ గారు ఇప్పుడున్న ఏజ్ లో, అయన ఉన్న హ్యాపీ పరిస్థితుల్లో అంత పెద్ద సినిమా బాధ్యత తీసుకుంటారా లేదా చూడాలి అని అన్నారు.

Also Read : SSMB 29 : ఆ రాష్ట్రంలో రాజమౌళి – మహేష్ బాబు షూటింగ్..? సెకండ్ షెడ్యూల్ అక్కడే..?

గతంలో అల్లు అర్జున్ తన సొంత బ్యానర్ గీత ఆర్ట్స్ లో హ్యాపీ, బద్రీనాథ్, సరైనోడు, అలవైకుంఠపురంలో సినిమాలు చేసారు. ఇందులో బద్రీనాథ్ తప్ప అన్ని మంచి విజయాలు సాధించాయి. మరి బన్నీ వాసు చెప్పిన దాని బట్టి ఇక భవిష్యత్తులో అల్లు అర్జున్ సొంత నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ లో ఆయన సినిమా ఉండదనే తెలుస్తుంది.