SSMB 29 : ఆ రాష్ట్రంలో రాజమౌళి – మహేష్ బాబు షూటింగ్..? సెకండ్ షెడ్యూల్ అక్కడే..?
మహేష్ - రాజమౌళి సినిమా ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని, అడవుల్లో సాగుతుందని చెప్పారు ఆల్రెడీ.

Mahesh Babu Rajamouli SSMB 29 Movie Shooting Update
SSMB 29 : రాజమౌళి – మహేష్ బాబు సినిమాపై అంచనాలు ఉన్నా అప్డేట్లు లేవు. RRR తర్వాత మహేష్ తో సినిమా ప్రకటించిన రాజమౌళి ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా పనులన్నీ సైలెంట్ గానే చేస్తున్నాడు రాజమౌళి. సినిమా ఓపెనింగ్ అయింది అని తెలుసు కానీ ఒక్క ఫోటో కానీ, వీడియో కానీ బయటకు రానివ్వలేదు.
ఓపెనింగ్ తర్వాత కొన్ని రోజులు హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో వేసిన సెట్ లో ఈ సినిమా షూట్ జరిగింది. ఇటీవల మొదటి షెడ్యూల్ పూర్తి చేసి బ్రేక్ కూడా ఇచ్చారు. ఈ బ్రేక్ లో జిమ్ లో మహేష్ బాబు కష్టపడుతున్న ఓ వీడియో మాత్రం లీక్ అయింది. అయితే ఇప్పుడు రెండో షెడ్యూల్ కోసం రియల్ లొకేషన్స్ కి వెళ్లనున్నారట.
మహేష్ – రాజమౌళి సినిమా ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని, అడవుల్లో సాగుతుందని చెప్పారు ఆల్రెడీ. రాజమౌళి కెన్యాకు వెళ్లి అడవుల లొకేషన్స్ కూడా చూసొచ్చారు. అయితే ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ మాత్రం ఒరిస్సా రాష్ట్రంలోని తూర్పు కనుమల్లో ఉన్న అడవుల్లో చేయనున్నారట. ఆల్రెడీ అక్కడ రాజమౌళి టీమ్ రెక్కీ చేసారని, కొన్ని ప్లేస్ లు ఓకే చేసారని తెలుస్తుంది. త్వరలోనే రాజమౌళి మహేష్ బాబు అండ్ టీమ్ ఒరిస్సాకు వెళ్లి అక్కడ షూటింగ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.
షూటింగ్ చేస్తున్నారు కానీ అప్డేట్స్, కనీసం లీకులు కూడా ఏమి రావట్లేదని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఇటీవల రాజమౌళి ప్రెస్ మీట్ పెడతారు అన్నారు కానీ అది కూడా జరగలేదు. ఇలా ఏదో ఒక లీకులు షూటింగ్ గురించి రావడం తప్ప టైటిల్, ఫోటోలు, వీడియోలు మాత్రం బయటకు రానివ్వకుండా కట్టుదిట్టంగా షూటింగ్ చేస్తున్నారు రాజమౌళి. మరి ఇన్నాళ్లు ఇన్ డోర్ కాబట్టి కంట్రోల్ చేయగలిగారు. ఇప్పుడు అవుట్ డోర్ కి వెళ్తే అదే జాగ్రత్త మెయింటైన్ చేస్తారా చూడాలి.