Sai Rajesh : బాబోయ్.. బేబీ డైరెక్టర్ కి.. అంత ఖరీదైన వాచ్ గిఫ్ట్ గా ఇచ్చిన నిర్మాత.. వాచ్ మాత్రం అదిరిందిగా..
తాజాగా ఓ నిర్మాత బేబీ దర్శకుడికి ఖరీదైన వాచ్ బహుమతిగా ఇచ్చాడు.

Producer Dheeraj Mogilineni Gifted Costly Watch to Baby Director Sai Rajesh
Sai Rajesh : సినిమాలు సక్సెస్ అయినా లేదా ఏదన్నా స్పెషల్ డేస్ లో నిర్మాతలు హీరోలకు లేదా దర్శకులకు ఏదో ఒక కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తుంటారు. అప్పుడప్పుడు హీరోలు కూడా దర్శకులకు, మూవీ యూనిట్ కి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. ఈ గిఫ్ట్స్ లో ఎక్కువగా కార్లు, వాచ్ లే ఉంటాయి. తాజాగా ఓ నిర్మాత బేబీ దర్శకుడికి ఖరీదైన వాచ్ బహుమతిగా ఇచ్చాడు.
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని తాజాగా బేబీ దర్శకుడు సాయి రాజేష్ కి ఖరీదైన వాచ్ ని బహూకరించాడు. ఇప్పుడు ఏ స్పెషల్ డే, సినిమా లేకపోయినా ఈ గిఫ్ట్ ఇవ్వడం గమనార్హం. అయితే ఆ ఖరీదైన వాచ్ టాగ్ హెయూర్ కంపెనీ ఫార్ములా 1 మోడల్. ఈ వాచ్ ఖరీదు ఆన్లైన్ లో దాదాపు ఒక లక్షా 83 వేల రూపాయల నుంచి నుంచి రెండు లక్షల రూపాయలు పైనే చూపిస్తుంది.
ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఈ నిర్మాత దర్శకుడికి ఖరీదైన వాచ్ ఇవ్వడం చర్చగా మారింది. వీరిద్దరి కాంబోలో ఫ్యూచర్ లో సినిమా రాబోతోందా లేక ఫ్రెండ్షిప్ తో గిఫ్ట్ గా ఇచ్చాడా అని అనుకుంటున్నారు. ధీరజ్ ఈ వాచ్ గిఫ్ట్ గా ఇస్తున్న ఫోటోని సాయి రాజేష్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. మా నిర్మాత నుంచి ఖరీదైన గిఫ్ట్ అని రాసుకొచ్చాడు. మొత్తానికి ఈ కాస్ట్లీ వాచ్ వైరల్ గా మారగా వాచ్ మాత్రం బాగుంది అని కామెంట్స్ చేస్తున్నారు.