Babu Mohan Shocking Comments on Padma Shri Awards
Babu Mohan : ఎన్నో సినిమాలలో తన కామెడీతో నవ్వించిన బాబు మోహన్ ఆ తర్వాత రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉన్నా అడపాదపడా రాజకీయాల్లో కనిపిస్తున్నారు. తాజాగా 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పద్మ అవార్డు తనకు రాకుండా రాజకీయం చేసారని అంటూ పద్మ అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేసారు బాబూమోహన్.
Also Read : Pradeep Ranganathan : నిర్మాత కాస్ట్లీ కార్ గిఫ్ట్ ఇస్తే వద్దని.. లవ్ టుడే హీరో ఏం చేసాడో తెలుసా?
బాబు మోహన్ మాట్లాడుతూ.. నాకు పద్మ అవార్డులు ఎప్పుడో రావాలి. నా సన్నిహితులకు ఎప్పుడో వచ్చేసాయి. 15, 20 ఏళ్ళ క్రితమే వాళ్లకు వచ్చేసాయి. నాకు కూడా అప్పుడే రావాలి. కానీ దీంట్లో కూడా కొంత రాజకీయం చేసారు. అవి రాలేదని కూడా బాధలేదు. ఎందుకూ పనికిరాని బుర్రకథ చెప్పేవాళ్లకు, చెట్టు కింద ఉండి అది వాయించుకునేవాళ్లకు ఇస్తున్నారు. కానీ ఇంత రంజింపచేసిన మాలాంటి వాళ్ళు కనపడట్లేదు వాళ్లకు. మరి వాళ్ళు ఎలా అవార్డు ఇస్తున్నారో వాళ్ళకే తెలియాలి. పద్మ అవార్డ్స్ కూడా స్టార్స్ కి, స్టార్స్ లాంటోళ్ళకి ఇవ్వాలి. అలాంటోళ్ళకి కూడా ఇవ్వాలి. దాన్ని విమర్శించట్లేదు, అవమానించట్లేదు. కానీ అవార్డులకు ఒక విలువ ఇచ్చి విలువైన వాళ్లకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అయినా అవార్డులు కాదు ప్రజల్లో ఉండాలి. డాక్టరేట్లు, వేరే అవార్డులు చాలా వచ్చాయి. ఏదైనా అవార్డే అని అన్నారు.
దీంతో బాబు మోహన్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మోహన్ బాబు కోట శ్రీనివాస రావు ఇద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నవ్వించిన సంగతి తెలిసిందే. కోట శ్రీనివాస రావుకు 2015 లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. మరో లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందంకు 2009 లోనే పద్మ శ్రీ అవార్డు వచ్చింది. ఈ విషయంలో బ్రహ్మానందం తనకు అవార్డు రాలేదని బాధపడుతున్నట్టు ఈ వ్యాఖ్యలతో తెలుస్తుంది.