Pradeep Ranganathan : నిర్మాత కాస్ట్లీ కార్ గిఫ్ట్ ఇస్తే వద్దని.. లవ్ టుడే హీరో ఏం చేసాడో తెలుసా?
లవ్ టుడే సినిమాలో హీరోగా తెలుగు, తమిళ్ లో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు ప్రదీప్ రంగనాథన్.

Pradeep Ranganathan Rejects Costly Car it gifts from Producer
Pradeep Ranganathan : లవ్ టుడే సినిమాలో హీరోగా తెలుగు, తమిళ్ లో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు ప్రదీప్ రంగనాథన్. ఇప్పుడు హీరోగా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాతో ఇటీవల ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ కొట్టాడు. ఇప్పటికే ఈ సినిమా 50 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి దూసుకెళ్తుంది.
అయితే ప్రదీప్ ఎప్పుడో సినీ పరిశ్రమలో నిరూపించుకున్నాడు. షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ సినీ పరిశ్రమలో డైరెక్టర్ గా అవకాశాల కోసం ట్రై చేసే వాడు ప్రదీప్ రంగనాథన్. అతను తీసిన ఓ షార్ట్ ఫిలిం వైరల్ అయి అది నచ్చి తమిళ్ హీరో జయం రవి దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చాడు. అలా ప్రదీప్ రంగనాథన్ దర్శకుడిగా జయం రవి, కాజల్ జంటగా కోమలి అనే సినిమా తీసాడు. ఆ సినిమా పెద్ద హిట్ అయి 2019 లోనే 40 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.
కోమలి సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఆ సినిమా నిర్మాత ప్రదీప్ ని పిలిచి ఓ కాస్ట్లీ కార్ గిఫ్ట్ గా ఇవ్వబోయారు. అయితే ప్రదీప్.. సర్ నాకు కార్ వద్దు. దానికి డీజిల్ కొట్టించి మెయింటైన్ చేసేంత స్థోమత నాకు లేదు. మీకు నిజంగా నాకు ఏమన్నా ఇవ్వాలనిపిస్తే ఆ కార్ ఎంత విలువ చేస్తుందో అంత డబ్బు ఇప్పించండి అని అడిగాడట. దీంతో నిర్మాత మొదట ఆశ్చర్యపోయినా అతని పరిస్థితిని అర్ధం చేసుకొని డబ్బులు ఇచ్చాడు. ప్రదీప్ అలా వచ్చిన డబ్బులతో తన అప్పులు తీర్చేసాడు అని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
అయితే కోమలి హిట్ అయినా దర్శకుడిగా అవకాశాలు రాకపోవడంతో తనే హీరోగా, దర్శకుడిగా లవ్ టుడే సినిమా 5 కోట్లతో తెరకెక్కిస్తే ఆ సినిమా తెలుగు, తమిళ్ లో పెద్ద హిట్ అయి 50 కోట్లపైనే వసూలు చేసింది. దీంతో ప్రదీప్ ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. లవ్ టుడే తర్వాత హీరోగా మూడు సినిమాలకు సైన్ చేసాడు. అందులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఇప్పుడు రిలీజయి హిట్ అయింది. ఈ సినిమా 100 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది.
తర్వాత కృతిశెట్టితో కలిసి లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ అనే సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం హీరోగా సక్సెస్ వస్తుండటంతో ఇలాగే కంటిన్యూ చేయనున్నాడు. ఫ్యూచర్ లో మళ్ళీ దర్శకుడిగా మారతాడు ప్రదీప్. మరో పక్క నిర్మాతగా కూడా మారుతున్నాడట.