Kirrak Seetha : ఐదేళ్లు రిలేషన్‌లో ఉండి.. వదిలేసి వెళ్ళిపోయాడు.. మిస్ యు అంటూ ఏడ్చేసిన బిగ్ బాస్ సీత..

బేబీ ఫేమ్, నటి కిరాక్ సీత కోసం ఓ బొమ్మని తీసుకొచ్చాడు బిగ్ బాస్. ఆ బొమ్మని చూసి సీత ఎమోషనల్ అయింది.

Baby Fame Actress Seetha got Emotional in Bigg Boss

Kirrak Seetha : బిగ్ బాస్ లో టాస్కులు, గొడవలతో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయని తెలిసిందే. వాళ్ళ కష్టాలు, ఫ్యామిలీ మెంబర్స్ ని గుర్తుచేసి కంటెస్టెంట్స్ ఎమోషనల్ అయ్యేలా చేస్తాడు బిగ్ బాస్. తాజాగా నిన్నటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ కి సంబంధించిన కొన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చి వాళ్ళని ఎమోషనల్ చేసాడు బిగ్ బాస్.

Also Read : NTR – Alia Bhatt : ఒరే బాబు.. నేను ‘దేవర’లో నటించలేదు.. అలియా భట్ కామెంట్స్..

ఈ క్రమంలో బేబీ ఫేమ్, నటి కిరాక్ సీత కోసం ఓ బొమ్మని తీసుకొచ్చాడు బిగ్ బాస్. ఆ బొమ్మని చూసి సీత ఎమోషనల్ అయింది. సీత మాట్లాడుతూ.. అయిదేళ్ల పాటు ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉన్నాను. అతడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక నాకు ఒక ఫ్రెండ్ దొరికాడు. అతడే ఈ బొమ్మ కొనిచ్చాడు. ఆ బొమ్మ లేకుండా నేను అసలు నిద్రపోలేను అంటూ ఎమోషనల్ అయింది. తన ఫ్రెండ్ కుమార్ కి మిస్ యు అని చెప్తూ ఏడ్చేసింది సీత.