NTR – Alia Bhatt : ఒరే బాబు.. నేను ‘దేవర’లో నటించలేదు.. అలియా భట్ కామెంట్స్..
బాలీవుడ్ భామ అలియా భట్ తో కూడా ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసాడు ఎన్టీఆర్.

Alia Bhatt Reacts on Guest Appearance in NTR Devara Movie
NTR – Alia Bhatt : ప్రస్తుతం అంతా దేవర హైప్ నడుస్తుంది. సినిమా మరో రెండు వారాల్లో రిలీజ్ కాబోతుంది. ఇటీవల దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబై లో ఘనంగా చేసారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ అక్కడ కొన్ని ప్రమోషనల్ ఇంటర్వ్యూలు చేసారు. అందులో బాలీవుడ్ భామ అలియా భట్ తో కూడా ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసాడు ఎన్టీఆర్.
అలియా త్వరలో జిగ్రా అనే సినిమాతో రాబోతుంది. దీంతో కరణ్ జోహార్ అలియా, ఎన్టీఆర్ లను కలిపి దేవర, జిగ్రా రెండు సినిమాలకు ప్రమోషన్ అయ్యేలా ఇంటర్వ్యూ చేసాడు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆల్రెడీ గతంలో RRR సినిమాలో అలియా భట్ నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్, అలియా కలిసి ప్రమోట్ చేస్తుండటంతో అలియా భట్ దేవరలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చిందని, చిన్న రోల్ చేసిందని బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి.
Also Read : Devara Song : దేవర నాలుగో సాంగ్ అప్డేట్.. ఆయుధ పూజ సాంగ్ వచ్చేది అప్పుడే..
అయితే వీటికి అలియా భట్ స్పందించింది. జిగ్రా ప్రమోషన్స్ లోనే ఓ ఇంటర్వ్యూలో వీటిపై క్లారిటీ ఇస్తూ.. నేను దేవర సినిమాలో నటించలేదు. అవన్నీ ఫేక్ న్యూస్. కేవలం ప్రమోషన్స్ కోసమే ఎన్టీఆర్ ని కలిసాను అంటూ క్లారిటీ ఇచ్చింది.