Devara Song : దేవర నాలుగో సాంగ్ అప్డేట్.. ఆయుధ పూజ సాంగ్ వచ్చేది అప్పుడే..

తాజాగా దేవర సినిమా నాలుగో పాట అప్డేట్ ఇచ్చారు రామజోగయ్యశాస్త్రి.

Devara Song : దేవర నాలుగో సాంగ్ అప్డేట్.. ఆయుధ పూజ సాంగ్ వచ్చేది అప్పుడే..

NTR Devara Movie

Updated On : September 14, 2024 / 6:32 AM IST

Devara Song : ఎన్టీఆర్ దేవర సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మూడు పాటలు, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచారు. ఇక దేవర పార్ట్ 1 సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.

దేవర సినిమా హైప్ పెంచేవాళ్ళల్లో లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి ఒకరు. రెగ్యులర్ గా ఏదో ఒక ట్వీట్ వేసి దేవర సినిమాపై హైప్ పెంచుతూ ఉంటారు. తాజాగా దేవర సినిమా నాలుగో పాట అప్డేట్ ఇచ్చారు రామజోగయ్యశాస్త్రి. తన ట్వీట్ లో.. వచ్చే వారం పాన్ ఇండియా లెవల్లో పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరగనుంది. ఆయుధ పూజ ట్రాక్ రాబోతుంది అని తెలిపారు. దీంతో దేవర నాలుగో సాంగ్ వచ్చే వారం రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది.

Also Read : NTR – Vishwak – Siddhu : విశ్వక్, సిద్ధూ జొన్నలగడ్డతో ఎన్టీఆర్ స్పెషల్ దేవర ఇంటర్వ్యూ.. ఫోటో లీక్..

గతంలో దేవర యూనిట్, కెమెరామెన్ రత్నవేలు దేవర సినిమాలోని ఆయుధ పూజ సాంగ్ గురించి గొప్పగా చెప్తూ ట్వీట్స్ వేశారు. ఇప్పుడు పాట రాసిన రామజోగయ్య శాస్త్రి కూడా వచ్చే వారమే ఆ పాట రిలీజ్ కాబోతుంది అంటూ చెప్పడంతో సినిమాపై, ముఖ్యంగా ఆయుధ పూజ సాంగ్ పై మరింత హైప్ నెలకొంది. మరి ఆయుధ పూజ సాంగ్ ఫ్యాన్స్ ని ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.