ఆమిర్ అడిగాడు.. అక్షయ్ తగ్గాడు – బచ్చన్ పాండే న్యూ రిలీజ్ డేట్
ఆమిర్ ఖాన్ సినిమా కోసం తన సినిమా విడుదలను వాయిదా వేసుకున్న అక్షయ్ కుమార్..

ఆమిర్ ఖాన్ సినిమా కోసం తన సినిమా విడుదలను వాయిదా వేసుకున్న అక్షయ్ కుమార్..
బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘బచ్చన్ పాండే’ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. వివారాల్లోకి వెళితే.. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్‌ఖాన్ హీరోగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. ఈ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్‌కు విడుదల చేయాలని అనుకున్నారు.
అయితే క్రిస్మస్ రోజు అక్షయ్‌కుమార్ ‘బచ్చన్ పాండే’ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. ఒకే సమయంలో ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయితే కలెక్షన్స్ పరంగా ఇబ్బందులు వస్తాయని భావించిన ఆమిర్.. అక్షయ్‌కు ఫోన్ చేసిన మాట్లాడారు. దాంతో అక్షయ్ తన సినిమాను వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయడానికి రెడీ అయ్యారు.
Read Also : శర్వానంద్ ‘శ్రీకారం’ ఫస్ట్‌లుక్ చూశారా!
దీని గురించి ఆమిర్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. ‘‘కొన్ని సమయాల్లో చిన్న మాటలే చాలా గొప్పగా అనిపిస్తాయి. మా మిత్రుడు అక్షయ్ కుమార్, నిర్మాత సాజిద్ నడియాడ్ వాలాకు థ్యాంక్స్. వారు తమ ‘బచ్చన్ పాండే’ సినిమా విడుదలను వాయిదా వేసుకున్నారు.. వారి సినిమాకు నా అభినందనలు’’ అని ట్వీట్ చేశారు ఆమిర్ ఖాన్. ‘లాల్ సింగ్ చద్దా’ 2020 క్రిస్మస్‌కి రిలీజ్ కానుండగా.. ‘బచ్చన్ పాండే’ 2021 జనవరి 21న విడుదల అవనుంది.
Sometimes all it takes is one conversation. Thank you to my friends @akshaykumar & Sajid Nadiadwala for their warm gesture of moving the release date of their film Bachchan Pandey at my request. I wish them the very best for their film. Looking forward to it.
Love.
a— Aamir Khan (@aamir_khan) January 27, 2020