Sathyaraj : విజయ్ గెలిచినా నా సపోర్ట్ డీఎంకే పార్టీకే.. కట్టప్ప కామెంట్స్ వైరల్..

తమిళ నటీనటులు అంతా విజయ్ కి అభినందనలు చెప్తున్నారు. (Sathyaraj)

Sathyaraj

Sathyaraj : తమిళనాడు ఎన్నికల్లో TVK పార్టీ అధినేత, విజయ్ అనూహ్యంగా 108 సీట్లు సాధించారు. విజయ్ సీఎం అవ్వడానికి, అధికారం చేపట్టడానికి మరో పది సీట్లు కావాలి. ఇతర పార్టీల సహకారంతో విజయ్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ దారుణంగా ఓడిపోయి ఏకంగా మూడో స్థానానికి పడిపోయింది.

తమిళ నటీనటులు అంతా విజయ్ కి అభినందనలు చెప్తున్నారు. ఈ క్రమంలో తమిళ నటుడు, బాహుబలి కట్టప్ప సత్యరాజ్ ఆసక్తికర కామెంట్స్ చేస్తూ ఓ వీడియోని రిలీజ్ చేసారు.

Also Read : Vijay Thalapathy: విజయ్ విజయం పూజ ముందే ఊహించింది.. కావాలంటే ఈ వీడియో చూసేయండి మరి!

సత్యరాజ్ మాట్లాడుతూ.. తమిళనాడులో గెలిచిన విజయ్ కి అభినందనలు. మీరు పెరియార్, అంబేద్కర్ ఆదర్శమని చెప్పారు. వారి విలువలను నిలబెట్టి సామజిక న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీరు ప్రకటించిన మీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి. డీఎంకే స్టాలిన్ ఓటమి చాలా బాధగా ఉంది. అయినా భవిష్యత్తులో కూడా సపోర్ట్ డీఎంకే కే ఉంటుంది అని తెలిపారు.

నటుడు సత్యరాజ్ మొదట్నుంచి డీఎంకే పార్టీ కి సపోర్ట్ చేస్తారు. సత్యరాజ్ కూతురు దివ్య డీఎంకే పార్టీలో అధికారికంగా చేరి పార్టీ కోసం పనిచేసారు.


 

Also Read : Mohan Babu : 15 లక్షల విరాళం.. ప్రతి సంవత్సరం ఫ్రీగా చదువు.. మోహన్ బాబుని అభినందిస్తున్న టాలీవుడ్..