Mohan Babu : 15 లక్షల విరాళం.. ప్రతి సంవత్సరం ఫ్రీగా చదువు.. మోహన్ బాబుని అభినందిస్తున్న టాలీవుడ్..
Mohan Babu: ఈ కార్యక్రమానికి దాసరి తో ఎంతో అనుబంధం ఉన్న మోహన్ బాబు అతిథిగా హాజరయ్యారు. (Mohan Babu)
Mohan Babu Announce Free Education And Fund To Directors Association
Mohan Babu : దివంగత దర్శకుడు దాసరి నారాయణ రావు పుట్టిన రోజు (మే 4)ని డైరెక్టర్స్ డేగా తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్స్ డే కార్యక్రమం సోమవారం నాడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి అనేకమంది సెలబ్రిటీలు, దర్శకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి దాసరి తో ఎంతో అనుబంధం ఉన్న మోహన్ బాబు అతిథిగా హాజరయ్యారు.
Also Read : Sumanth Prabhas : తెలుగు సినిమాలో ఫస్ట్ టైం ఆటో రేస్.. గోదావరి ఆటో డ్రైవర్ గా తెలంగాణ హీరో..
ఈ కార్యక్రమంలో మోహన్ బాబు మాట్లాడుతూ.. తండ్రిలాంటి దాసరి గారు లేరనే లోటు నాకు జీవితాంతం ఉంటుంది. ఓ సాధారణ వ్యక్తిని తీసుకువచ్చి మోహన్ బాబుగా మార్చారు. మా యూనివర్సిటీలో అక్కయ్య గారి పేరు మీద గోల్డ్ మెడల్స్ ఇస్తుంటాను. దాసరి గారి పేరు మీద ఆడిటోరియంను కట్టాం. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ కి పదిహేను లక్షలు ఆర్థిక విరాళాన్ని అందిస్తాను అని ప్రకటిస్తున్నాను. అలాగే గతంలో దాసరి గారికి చెప్పాను. మీరు ఎవరైనా విద్యార్థిని పంపిస్తే చదివిస్తాను అని. ఆయన ఇద్దర్ని పంపించారు. వాళ్ళను చదివించాను. ఇప్పుడు డైరెక్టర్ అసోసియేషన్ నుండి ప్రతి సంవత్సరం ఒక స్టూడెంట్ ని పంపండి. ఆరవ తరగతి నుండి ఇంజనీరింగ్ అయ్యేంత వరకు నా యూనివర్సిటీ లో ఫ్రీగా చదివిస్తాను అని తెలిపారు. దీంతో దర్శకులు, టాలీవుడ్ జనాలు, ఫ్యాన్స్, నెటిజన్లు మోహన్ బాబుని అభినందిస్తున్నారు.
View this post on Instagram
