Sumanth Prabhas : తెలుగు సినిమాలో ఫస్ట్ టైం ఆటో రేస్.. గోదావరి ఆటో డ్రైవర్ గా తెలంగాణ హీరో..
గోదారి గట్టు పైన సినిమాలో సుమంత్ ప్రభాస్ ఆటో డ్రైవర్ గా నటిస్తున్నాడు. (Sumanth Prabhas)
Sumanth Prabhas
Sumanth Prabhas : షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ సినీ పరిశ్రమలోకి వచ్చాడు సుమంత్ ప్రభాస్. మేమ్ ఫేమస్ అనే సినిమాతో దర్శకుడిగా, హీరోగా మొదటి సినిమాతోనే హిట్ కొట్టి మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. తెలంగాణ నుంచి వచ్చిన మరో హీరోగా స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. సుమంత్ ప్రభాస్ ఇప్పుడు గోదారి గట్టు పైన అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా మే 8న రిలీజ్ కానుంది.
గోదారి గట్టు పైన సినిమాలో సుమంత్ ప్రభాస్ ఆటో డ్రైవర్ గా నటిస్తున్నాడు. గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్, రాజమండ్రి దగ్గర్లోని ఓ పల్లెటూరులో ఈ కథ జరగుతుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. నేడు హీరో సుమంత్ ప్రభాస్ మీడియాతో మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయం తెలిపాడు.
Also Read : Kamakshi Bhaskarla : నటిగా పీక్స్ లో కెరీర్.. సడెన్ గా సినిమాలకు బ్రేక్ ప్రకటించిన హీరోయిన్..
సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను ఆటో డ్రైవర్ గా నటిస్తున్నాను. అందుకోసం ఆటో డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాను. నాలుగు రోజులు కష్టపడి ఆటో డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఈ సినిమా ఓపెనింగ్ లోనే ఆటో రేసింగ్ సీన్ ఉంటుంది. ఆటో రేస్ జరుగుతుంది. అందులో నేను ఆటోలని తప్పించుకుంటూ వెళ్ళాలి. ఆ సీన్స్ లో నేనే స్వయంగా ఆటో తోలాను. అందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది అని తెలిపాడు.
దీంతో మొదటిసారి ఓ తెలుగు సినిమాలో ఆటో రేస్ పెట్టినట్టు తెలుస్తుంది. మరి ఈ ఆటో రేస్ ఎలా ఉంటుందో సినిమాలో చూడాల్సిందే.
Also Read : Jani Master : కష్టాల్లో నటి.. అమ్మ ఆపరేషన్ కి మొత్తం నేనే సాయం చేస్తానన్న జానీ మాస్టర్..
