Vijay Thalapathy: విజయ్ విజయం పూజ ముందే ఊహించింది.. కావాలంటే ఈ వీడియో చూసేయండి మరి!
తమిళనాడు ఎన్నికల్లో విజయ్(Vijay Thalapathy) విజయాన్ని ముందే ఊహించిన స్టార్ బ్యూటీ పూజా హెగ్డే.
pooja hegde prediction on vijay victory in tamil nadu election
- విజయ్ గెలుస్తాడన్న బుట్టబొమ్మ పూజా హెగ్డే
- జన నాయగన్ షూటింగ్ లోనే చెప్పేసింది
- నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
Vijay Thalapathy: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్(Vijay Thalapathy)’. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఈ సినిమా హాట్ టాపిక్‌గా మారింది. హెచ్.వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం, సెన్సార్ వివాదాల కారణంగా ఎన్నికల సమయంలో విడుదల కాకుండా నిలిచిపోయింది. ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, మమితా బైజు, ప్రియమణి, బాబీడియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’లో మరో స్టార్.. అక్షయ్ కుమార్ ఎంట్రీతో భారీ హైప్
సినిమా విడుదల వాయిదా పడినా, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో అభిమానుల్లో జోష్ నింపుతోంది. తమిళనాడు ఎన్నికల్లో విజేత ఎవరనే ప్రశ్నకు పూజా హెగ్డే ఏమాత్రం తడుముకోకుండా పక్కనే ఉన్న విజయ్ను చూపిస్తూ సమాధానం ఇచ్చారు. ఈ వీడియో షూటింగ్ గ్యాప్‌లో సరదాగా చిత్రీకరించినట్లు కనిపిస్తోంది. పూజా కాన్ఫిడెన్స్‌కు విజయ్ సిగ్గుపడుతూ ఇచ్చిన రియాక్షన్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ దృశ్యాలు నెట్టింట సెన్సేషన్‌గా మారాయి.
ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ రాజకీయ భవిష్యత్తుపై పూజా హెగ్డేకు ముందే అంత నమ్మకం ఉందా అంటూ ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు. మరికొందరు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ, రాజకీయాల్లో విజయ్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సినిమా సెన్సార్ వివాదాలతో వార్తల్లో ఉంటే, పూజా హెగ్డే చేసిన ఈ సందడి మాత్రం దళపతి అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ను అందిస్తోంది.
BREAKING: Pooja Hegde points at Thalapathy Vijay as the election winner and he responds with a shy blush. pic.twitter.com/aUdvjB7Odx
— Actor Vijay Team (@ActorVijayTeam) May 5, 2026
