Bajrang Dhal destroyed Pathaan flex in Gujarat
Pathaan : బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమా దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో వ్యతిరేకతను ఎదురుకుంటుంది. అసలే కొన్నాళ్లుగా సరైన హిట్టు లేకపోవడంతో.. ఎన్నో జాగ్రత్తలు తీసుకోని మరి ఈ సినిమా చేశాడు షారుఖ్. అయినా సరి పఠాన్ చిత్రం వివాదంలో చిక్కుకుంది. ఇంతకు ముందు బాలీవుడ్ లోని ఏ మూవీ ఎదురుకొని వ్యతిరేకతను ఈ సినిమా ఎదురుకుంటుంది.
Pathaan: పఠాన్ ట్రైలర్ రిలీజ్‌కు డేట్ కన్ఫం చేసిన కింగ్ ఖాన్!
ప్రేక్షకులు, రాజకీయనాయకులు, మత సంఘాలు ఆఖరికి సినీ వర్గాల నుంచి కూడా విమర్శలు ఎదురుకుంటుంది. తాజాగా ఈ చిత్రం విడుదల గురించి ఘాటుగా స్పందించింది భజరంగ్ ధాల్. అహ్మదాబాద్ వస్త్రపుర్ ప్రాంతంలోని ఆల్ఫా వన్ మాల్‌లో ఉన్న పఠాన్ ఫ్లెక్సీలను ధ్వంసం చేస్తూ నిరసన తెలియజేశారు. అలాగే పఠాన్ సినిమాని థియేటర్‌లో ప్రదర్శించే ప్రయత్నం చేయవద్దు అంటూ హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
దీంతో థియేటర్ల ఓనర్లు సినిమా విడుదల చేయడానికి ఆలోచిస్తున్నారు. మరి ఇంత వ్యతిరేకత మధ్య పఠాన్ సినిమాని ఎలా రిలీజ్ అవుతుందో చూడాలి. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పడుకోణె నటిస్తుండగా జాన్ అబ్రహం ఒక ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రంలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో మెరవబోతున్నాడు.
#WATCH | Gujarat | Bajrang Dal workers protest against the promotion of Shah Rukh Khan’s movie ‘Pathaan’ at a mall in the Karnavati area of Ahmedabad (04.01)
(Video source: Bajrang Dal Gujarat’s Twitter handle) pic.twitter.com/NelX45R9h7
— ANI (@ANI) January 5, 2023