Balagam : తెలంగాణ ప్రభుత్వం తరపున బలగం చిత్ర యూనిట్ కు సన్మానం..

తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ(TSFDC) కార్యాలయంలో బలగం చిత్రయూనిట్ ని తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం సన్మానించారు. చిత్ర యూనిట్ కు శాలువాలు కప్పి, జ్ఞాపికలను అందచేశారు.

Balagam :  కమెడియన్ వేణు(Venu) దర్శకుడిగా మారి ప్రియదర్శి(Priyadarshi), కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyan Ram) జంటగా మానవ సంబంధాలు, కుటుంబ విలువలు కథాంశంతో తెరకెక్కించిన సినిమా బలగం(Balagam). దిల్ రాజు(Dil Raju) కూతురు హన్షిత రెడ్డి(Hanshitha Reddy) ఈ సినిమాని నిర్మించింది. చిన్న సినిమాగా రిలీజయి పెద్ద విజయం సాధించింది. కలెక్షన్స్ తో పాటు పేరు కూడా సంపాదించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై ప్రేక్షకులు, ప్రముఖుల నుంచి అభినందనలు వస్తున్నాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు కూడా అందుకుంది బలగం సినిమా.

ముఖ్యంగా తెలంగాణ సంసృతి, సాంప్రదాయాలు కనపడేలా బలగం సినిమా తెరకెక్కించడంతో తెలంగాణ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ సినిమాను అభినందిస్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం తరపున బలగం సినిమా యునిట్ ని సన్మానించారు. ఆదివారం నాడు హైదరాబాద్ మసాబ్ ట్యాంక్ లోని తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ(TSFDC) కార్యాలయంలో బలగం చిత్రయూనిట్ ని తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం సన్మానించారు. చిత్ర యూనిట్ కు శాలువాలు కప్పి, జ్ఞాపికలను అందచేశారు.

Maniratnam : బాహుబలి లేకపోతే పొన్నియిన్ సెల్వన్ లేదు..

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. సినిమాలో బలమైన కథ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి బలగం సినిమా రుజువు చేసింది. కొత్తతరం ప్రతిభను ప్రోత్సహిస్తున్న నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డిలకు నా అభినందనలు. తెలంగాణ సంసృతి, సంప్రదాయాలు, అనుబంధాలు గొప్పగా చూపించిన సినిమా బలగం. సినిమా చూసి ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో జరిగిన సంఘటనలని గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ సినిమా మరింత పురోగతి సాధించేందుకు ముఖ్యమంత్రి KCR, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహకారంతో ప్రభుత్వం తరపున ప్రోత్సాహం అందించడానికి కృషి చేస్తాం అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు