Balakrishna : బాలకృష్ణ 50 ఏళ్ళ నట ప్రస్థానం వేడుకలు షురూ..

తాజాగాబాలకృష్ణ 50 ఏళ్ళ నట ప్రస్థానం వేడుకలకు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం ఫిలిం ఛాంబర్ లో నిర్వహించారు.

Balakrishna 50 Years Celebrations Curtain Riser Event Happened in Film Chamber

Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ పరిశ్రమలో నటుడిగా 50 ఏళ్ళు పూర్తిచేసుకోవడంతో ఇటు తెలుసు పరిశ్రమ, అటు అభిమానులు స్పెషల్ సెలబ్రేషన్స్ చేయనున్నారు. తెలుగు పరిశ్రమలో అన్ని క్రాఫ్ట్స్ కి చెందిన వారు కలిసి సెప్టెంబర్ 1న హైదరాబాద్ లో బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలను గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం ఫిలిం ఛాంబర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ సోదరులు నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను, వైవిఎస్ చౌదరి, పలువురు నిర్మాతలు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ.. మా తమ్ముడు బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేయడం గొప్ప విషయం. మా నాన్నలాగే ఎలాంటి పాత్రను అయినా చేయగలను అని నిరూపించుకున్నాడు. సినిమాల్లోనే కాక రాజకీయాల్లో కూడా బాలకృష్ణ నాన్న గారి వారసత్వం అందుకున్నారు అని అన్నారు. సీనియర్ డైరెక్టర్, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా మాట్లాడుతూ.. బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి అయినా ఇంకా కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఇన్నేళ్లు నటుడిగా కెరీర్ చూసిన వాళ్ళు అమితాబ్ తర్వాత బాలయ్యే. బాలకృష్ణ చిన్నప్పట్నుంచి కూడా ఒక సామాన్యుడిలాగే తిరుగుతారు. బాలకృష్ణ 50 వసంతాల ఈవెంట్ సినీ పరిశ్రమ నిర్వహించడం మంచి విషయం అని అన్నారు.

Also Read : Chiranjeevi-Harish Shankar : హరీశ్‎తో మెగాస్టార్ మరో రీమేక్..?

సీనియర్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి మాట్లాడుతూ.. బాలకృష్ణతో అందరికంటే ఎక్కువగా 13 సినిమాలు చేశాను. అన్నగారి బాటలోనే బాలయ్య కూడా దర్శకులకు ఎంతో గౌరవం ఇస్తారు. ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా జై బాలయ్య అనే వినిపిస్తుంది. బాలకృష్ణ అంతలా యూత్ నాడి పట్టుకున్నారు అని తెలిపారు. సీనియర్ నిర్మాత సి కల్యాణ్ మాట్లాడుతూ.. మా బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ ఆయన సినిమాల రికార్డుల ఫంక్షన్ కంటే గొప్పగా జరగాలి. సినీ పరిశ్రమలో అందరికి బాలయ్య గారి మీద ప్రేమ ఉంది. దేశవ్యాప్తంగా అన్ని భాషల నటీనటులు చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే గొప్ప ఈవెంట్‌గా బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఈవెంట్ జరుగుతుంది అని తెలిపారు.

డైరెక్టర్ వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ.. 1974లో గుడివాడలో తాతమ్మ కల సినిమా చూశా. అప్పుడే 50 ఏళ్లు అయిపోయిందా అనిపిస్తుంది. బాలకృష్ణ గారికి తల్లిదండ్రులతో పాటు ఎన్టీఆర్ రూపంలో గురువు కూడా ఇంట్లోనే ఉండటం అది ఆయన అదృష్టం. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారని అన్నారు. నిర్మాత తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. హ్యాట్రిక్ హీరోగా, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి సేవలందరిస్తూ హీరో నందమూరి బాలకృష్ణ పలు రికార్డులు సాధించారు. సేవారంగంలో కూడా బాలకృష్ణగారు ఎన్నో దానాలు చేశారు. మదనపల్లెలో ఒక టీచర్ కుమార్తెకు తన సొంతడబ్బుతో చికిత్స చేయించారు. రాయలసీమలో వరదలు వచ్చినప్పుడు స్పందన కార్యక్రమం చేపట్టారు. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన బాలయ్య 50 ఏళ్ల వేడుకకు అందరూ రావాలి. ఈ వేడుకకు బాలయ్య ఒప్పుకోలేదు కానీ ఇది ఒక స్ఫూర్తిదాయ కార్య్రక్రమంగా ఉంటుందని చెప్పడంతో ఆయన ఒప్పుకున్నారని అన్నారు.

Also Read : Mr Bachchan Trailer : ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ ట్రైల‌ర్‌.. మాస్ మ‌హారాజా ఈజ్ బ్యాక్‌..!

రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. నా అభిమాన హీరో రామారావుగారికి 1981లో ఛండశాసనుడు అనే సినిమాకు రాస్తున్నప్పుడు ఒక అందమైన కుర్రాడ్ని చూసాను. అతనే బాలకృష్ణ. బాలయ్యకు డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. తొడకొట్టే డైలాగ్ బాలయ్యకే సూట్ అవుతుంది. మేము రాసిన ప్రతి సినిమా బాలయ్యకు హిట్ ఇచ్చింది. టాలీవుడ్ లోని అన్ని అసోసియేషన్స్ కలిసి బాలయ్య 50 ఏళ్ల వేడుకని చేయడం గొప్ప విషయం అని తెలిపారు.

డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. 50 నిమిషాల పాటు వాకింగ్ చేస్తేనే మనం అలసిపోతాం. అలాంటిది ఆయన 50 ఏళ్లు సినిమాలు చేస్తూ వచ్చారు. ఆయన కష్టాన్ని గుర్తించి సినిమా పెద్దలందరూ ఇలాంటి వేడుక చేయడం అభినందనీయమైన విషయం. చేసిన పాత్ర చేయకుండా ఇండస్ట్రీలో 50 సంవత్సరాల్లో 109 సినిమాలు చేయడం మామూలు విషయం కాదు. ఆయన ఎప్పుడూ ఇలాగే ఎనర్జిటిక్ గా ఉండి ఇంకా సినిమాలు చేయాలి అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు