×
Ad

Akhanda 2 : ఛ.. అఖండ 2 నిర్మాత మారకపోయి ఉంటే బాగుండేది.. ఈ పాటికి సినిమా చూసి హిట్ కొట్టేవాళ్ళం.. ఫ్యాన్స్ ఆవేదన..

చివరి నిమిషంలో అఖండ 2 రిలీజ్ ఆగిపోయింది.(Akhanda 2)

Akhanda 2

Akhanda 2 : బాలకృష్ణ – బోయపాటి కాంబోలో అఖండ 2 సినిమా కోసం ఫ్యాన్స్, సినిమా లవర్స్ ఎంతగానో ఎదురుచూసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై భారీ హైప్ ఇచ్చారు. బాలయ్య బాబు ఉగ్రరూపం చూడబోతున్నామని ఫ్యాన్స్ అంతా ఫిక్స్ అయ్యారు. కానీ చివరి నిమిషంలో అఖండ 2 రిలీజ్ ఆగిపోయింది.(Akhanda 2)

అఖండ 2 సినిమా నిర్మాతలు వారి పాత సినిమాల నష్టాలను డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎగ్జిబిటర్స్ ఇవ్వలేదని కోర్టులకు వెళ్లడం, ఫైనాన్షియర్స్ డబ్బులు ఇవ్వలేదని.. ఇలా పలు ఆర్ధిక సమస్యలతో సినిమా రిలీజ్ ఆగింది. దీంతో ఫ్యాన్స్ ఇది కేవలం నిర్మాత సమస్య అని క్లారిటీగా అర్థమవుతుందని, స్టార్ హీరోలతో సినిమా చేసేటప్పుడు ఇలాంటివి ముందే చూసుకోవాలి కదా అని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

Also Read : Dharma Mahesh : కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేసిన హీరో.. మీ పేరులో ఈ లెటర్ ఉందా అయితే స్పెషల్ ఆఫర్ మీకే..

అసలు నిర్మాత మారకుండా ఉంటే ఈ సమస్యే వచ్చేది కాదని ఈ పాటికే సినిమా చూసి హిట్ కొట్టేసేవాళ్ళం అని కూడా అంటున్నారు. అఖండ పార్ట్ 1 సినిమాని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ఆ సినిమా పెద్ద హిట్ అయి మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. నిర్మాత కూడా బాలయ్యకు దగ్గరయ్యారు. మరి ఏమైందో కానీ అఖండ 2 కి నిర్మాతలు మారిపోయారు.

మిర్యాల రవీంద్రర్ రెడ్డి పక్కకు తప్పుకోగా 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాని నిర్మించారు. ఈ నిర్మాతలు గతంలో వన్ నేనొక్కడినే, ఆగడు.. లాంటి పలు సినిమాల నష్టాలు ఇంకా తీర్చకపోవడంతో తమిళనాడులో ఈరోస్ సంస్థ కోర్టుకు వెళ్లడం జరిగింది. ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూటర్స్, ఫైనాన్షియర్స్ తో ఈ నిర్మాతకు ఆర్ధిక సమస్యలు ఉన్నాయని ఓ డిస్ట్రిబ్యూటర్ కూడా చెప్పాడు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ అసలు నిర్మాత మారకపోయి ఉంటే, పార్ట్ 1 చేసిన నిర్మాతే చేసి ఉంటే ఈ ఆర్ధిక సమస్యలు, తలనొప్పులు లేకుండా సినిమా రిలీజయిపోయేదేమో, ఈ పాటికి సినిమా చూసి హిట్ కొట్టేవాళ్ళమేమో అని అంటున్నారు ఫ్యాన్స్. మరి అఖండ నిర్మాతలు ఎందుకు మారారో మూవీ యూనిట్ కే తెలియాలి.

Also See : Pawan Kalyan : స్కూల్ పిల్లలతో పవన్.. పవర్ స్టార్ పక్కనుండటంతో పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి.. ఫోటోలు వైరల్..